ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య యుద్ధం అంతకంతకు పెరుగుతుండడంతో క్షణక్షణం ఉత్కంఠ రేగుతోంది.. అటు యుద్ధం మొదలైందని ఖమేనీ.. ఇటు ఇరాన్ తో చర్చలు లేవని ట్రంప్ అంటున్నారు. ఇజ్రాయెల్, అమెరికా ఒత్తిడితో ఖమేనీ తలవంచుతారా ? ఇరాన్లో ఖమేని కాలం చెల్లినట్టేనా? అటు ఖమేనీ చనిపోతే తప్ప ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధానికి ముగింపు ఉండదని ఇజ్రాయెల్ ప్రధాని ప్రధాని నెతన్యాహు అంటున్నారు.
ఇజ్రాయెల్ ప్రధానికి తోడుగా దేశ రక్షణ శాఖ మంత్రి ఖాజ్ కూడా మరో అడుగు ముందుకేశారు. “మాజీ ఇరాక్ సుప్రీం లీడర్ సద్దాం హుసేన్‌కు పట్టిన గతే ప్రస్తుత ఇరాన్ సుప్రీం లీడర్ కు పడుతుందని అన్నారు. ఇదే సమయంలో, ఇజ్రాయెల్ ఖమేనీని చంపాలనే ప్రణాళిక రూపొందిస్తే, దానిని తానే అడ్డుకున్నానని అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. దీంతో, “ఇరాన్ పని ఇక పూర్తైంది… దుకాణం బంద్!” అన్న సంకేతాలు కలకలం రేపుతున్నాయి.
ఒకవేళ ఖమేనీ హత్యకు గురై లేదా మరణించి లేదా రాజీనామా చేసినట్టయితే, ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు? ఖమేనీ తరహా లక్షణాలతో, ఇరాన్‌ను ముందుకు నడిపించే నాయకుడు ఎవరు? అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే, ఇరాన్ సుప్రీం లీడర్ మరణించిన తరువాత (లేదా అర్హత కోల్పోయిన తరువాత), కొత్త సుప్రీం నాయకుడిని ఎంచుకునే ప్రక్రియ ఎలా ఉంటుందన్నది కూడా ఇప్పుడు ప్రపంచానికి ఆసక్తిని కలిగిస్తోంది. పూర్తి వివరాలకు కింద ఉన్న వీడియో చూసేయండి.