వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకొని సోమవారం ఉదయాన్నే వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయకు వెళ్లిన వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వైఎస్ఆర్ ఘాట్ వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. అనంతరం ప్రార్థనలు నిర్వహించారు. జగన్ వెంట ఆయన సతీమణి వైఎస్ భారతి, తల్లి విజయమ్మ, కటుంబ సభ్యులు పాల్గొన్నారు.