చక్రం తిప్పిన ట్రంప్.. 30 రోజుల కాల్పుల విరమణకు ఉక్రెయిన్ ఓకే.. పుతిన్ షరతులు ఇవేనా..?

రష్యా-ఉక్రెయిన్ మధ్య మూడు సంవత్సరాలకు పైగా కొనసాగుతున్న యుద్ధం ముగింపు దశకు చేరుకున్నట్లు కనిపిస్తోంది. సౌదీ అరేబియాలో అమెరికా అధికారులతో జరిగిన చర్చల అనంతరం ఉక్రెయిన్ 30 రోజుల తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించింది. ఈ నిర్ణయాన్ని ట్రంప్ స్వాగతించగా, రష్యా ఎలా స్పందిస్తుందనేది ఆసక్తిగా మారింది.