Eknath Shinde..maharashtra's Politics
Maharashtra: శివసేన పార్టీ ఎవరిదో తేల్చే విషయంలో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే వర్గం వేసిన పిటిషన్లను రద్దు చేయాలని సుప్రీంకోర్టును ఆ రాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే కోరారు. పార్టీలోని మెజారిటీ సభ్యులు ప్రజాస్వామ్యబద్ధంగా తీసుకున్న నిర్ణయాలపై న్యాయస్థానాల జోక్యం అవసరం లేదని ఆయన అన్నారు. పార్టీలోని మెజారిటీ నేతలు తనకే మద్దతు తెలుపుతున్నారని చెప్పారు. శివసేన తమదేనని నిరూపించుకోవడానికి ఉద్ధవ్ ఠాక్రే, ఏక్‌నాథ్ షిండే అన్నివిధాలా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.
శివసేన తమదేనని చెబుతూ ఇరు వర్గాలు కేంద్ర ఎన్నికల సంఘానికి పత్రాలు సమర్పిస్తున్నాయి. ఆగస్టు 8లోగా పత్రాలు సమర్పించాలని ఇప్పటికే ఎన్నికల సంఘం ఇరు వర్గాలకు సూచించింది. అలాగే, శివసేనలో విభేదాలపై కూడా వారిద్దరు లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఏక్‌నాథ్ షిండే సుప్రీంకోర్టుకు పలు వివరాలు తెలిపారు.
ఉద్ధవ్ ఠాక్రే వద్ద ఉన్న 15 మంది ఎమ్మెల్యేలు కలిసి తన వద్ద ఉన్న 39 మంది ఎమ్మెల్యేలను రెబల్స్‌గా పిలవడం సరికాదని చెప్పారు. జూలై 25న ఉద్ధవ్ ఠాక్రే సుప్రీంకోర్టుకు తన వాదనలు వినిపించారు. కాగా, ఉద్ధవ్ ఠాక్రే వర్గం వేసిన పిటిషన్లపై తదుపరి విచారణ ఆగస్టు 3న జరగనుంది.
China: అందరినీ భయపెట్టిన తమ రాకెట్ శకలాలు ఎక్కడ పడ్డాయో తెలిపిన చైనా