vinayaka chavithi: మట్టి వినాయకుడ్ని మాత్రమే ఎందుకు పూజించాలంటే!

  • Publish Date - August 21, 2020 / 02:11 PM IST

eco friendly ganesh idols : వినాయకుడి విగ్రహాన్ని మట్టితో మాత్రమే ఎందుకు చేయాలి? దీని వెనుక శాస్త్రీయంగా చాలా అర్థాలు పరమర్థాలు ఉన్నాయి.. పర్యావరణ పరంగా మేలు జరుగుతుందని కొందరు అంటుంటే అందులోని విశిష్టిత చాలా గొప్పదని చెబుతున్నారు.. శాస్త్రీయంగానే కాదు.. నియమాలపరంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు.. శాస్త్రీయ నియమం ప్రకారం విగ్రహం వెనుక ఉన్న శాస్త్రం ఏం చెబుతుందో అందరూ తప్పక తెలుసుకోవాల్సిన అవసరం ఉంది..



బంకమట్టి నుండి గణేష్ విగ్రహాన్ని సిద్ధం చేయాలని నియమం చెబుతోంది.. ఈ రోజుల్లో, విగ్రహాలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నుంచి తయారవుతున్నాయి. తద్వారా తక్కువ బరువు ఉంటాయి.. ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి.. మట్టి, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ నుంచి తయారు చేసిన విగ్రహాల మధ్య చాలా వ్యత్యాసం ఉంది. వినాయకుడు అమ్మవారు శరీరం శుభ్రం చేసుకున్న పసుపు ముద్దనుంచి సృష్టించినట్టు పురాణాలలో ఉంది..

అందుకే ఆచార ఆరాధన కోసం మట్టితో చేసిన గణేష్ విగ్రహాన్ని తయారుచేయాలనే నియమం ఆచరణలో ఉంది.. మట్టి అంటే.. పవిత్రం.. అలాంటి మట్టితోనే గణపయను తయారుచేయాలి.. పూజించాలని శాస్త్రం చెబుతోంది.. స్వచ్ఛమైన పవిత్ర కణాలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో చేసిన దాని కంటే కూడా మట్టితో చేసిన విగ్రహం వైపు ఎక్కువ ఆకర్షితమౌతాయి.



బంకమట్టి కాకుండా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నుంచి విగ్రహాలను తయారు చేయడం శాస్త్రీయంగా సరికాదని, దీనివల్ల ప్రయోజనం కంటే పర్యావరణాన్ని ఎక్కువగా హనికరమని సూచిస్తోంది.. గణేష్ చతుర్థి పండుగ సందర్భంగా, గణేష్ విగ్రహాన్ని వ్యక్తిగతంగా సమష్టిగా పెద్ద ఎత్తున పూజిస్తారు. ఈ కారణంగానే గణేష్ చతుర్థి కోసం గణేష్ విగ్రహాన్ని ఎలా తయారుచేయాలి? అలా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఉంటాయి..

నియమం ప్రకారం చేయకపోతే ఆధ్యాత్మిక నష్టం గురించి లోతుగా చర్చకు వస్తున్నాయి. మట్టితో చేసిన వినాయక విగ్రహాలకు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారుచేసిన విగ్రహాలకు మధ్య తేడా ఏంటి? మట్టితోనే ఎందుకు విగ్రహాం తయారు చేయాలో తప్పక తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటంటే?



మట్టి నీటిలో వెంటనే కరిగిపోతుంది.. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ నీటిలో తేలికగా కరుగదు.. అందువల్ల విగ్రహం నిమర్జనం తర్వాత నీటిపై తేలుతుంది. కొన్నిసార్లు నగరాల్లో, ఎక్కువ కాలం నీటిలో కరగని విగ్రహాల అవశేషాలు సేకరించి వాటిని బురదగా మార్చడానికి బుల్డోజర్ వంటి వాటిని నడుపుతారు. దేవత విగ్రహాలకు తీవ్ర అవమానంతో సమానమైనది.

దేవతను ఆరాధించినప్పుడు, నిమజ్జనం చేసినప్పుడు అదే భక్తిని కలిగి ఉండాలనేది శాస్త్ర నియమం.. విగ్రహం సరిగ్గా మునగాలి.. లేదంటే దేవతను అగౌరవపరిచినదానితో సమానం.. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌ను నీటిలో కలపడం వల్ల నది, సముద్రం, సరస్సు అంతా కలుషితం అవుతాయి.. జీవుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.



ఈ రోజుల్లో కొబ్బరికాయలు, అరటిపండ్లు, వక్క, వెండి నాణేలు మొదలైన వాటి నుండి కూడా విగ్రహాలను తయారుచేసే తప్పుడు ధోరణి మొదలైంది.. ఈ వస్తువులలో కొన్ని విగ్రహాన్ని నిమజ్జనం చేసిన తరువాత నీటిలో కరగవు. ఇలాంటి విగ్రహాల అవశేషాలను ఇతర ప్రయోజనాల కోసం లేదా పిల్లల బొమ్మలుగా ఉపయోగిస్తారు.

గణేష్ విగ్రహాన్ని చెక్కినట్లయితే, గణేష్ స్వచ్ఛమైన ఆధ్యాత్మిక కణాలు విగ్రహం వైపు ఎక్కువ స్థాయిలో ఆకర్షిస్తాయి…విగ్రహాన్ని ఆరాధించేవారు ప్రయోజనం పొందుతారు. దురదృష్టవశాత్తు ఈ ఈరోజుల్లో, విగ్రహం వెనుక ఉన్న శాస్త్రాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదు.. ఎవరి ఇష్టం ఊహ ఆధారంగా విగ్రహాలను వివిధ రూపాల్లో ఆకారాలలో పూజిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు