100 fell sick from pani puri: పానీపూరి తిని 100 మందికి అస్వస్థత

ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక ఆరోగ్య శాఖ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని మెడికల్ సహాయం అందించారు. పలువురి పరిస్థితి తీవ్రంగా ఉండడంతో మరింత ఉత్తమ వైద్య సేవల నిమిత్తం వారిని పెద్ద ఆసుపత్రికి తరలించారు. అస్వస్థతకు గురైన వారు డొగచియా, బహిర్ రనగచా, మకల్టాలా గ్రామాలకు చెందిన వారిగా అధికారులు గుర్తించారు.

100 fell sick from pani puri: పానీపూరి తిని 100 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. పశ్చిమ బెంగాల్‭ రాష్ట్రం హుగ్లీ జిల్లాలో వెలుగు చూసిందీ ఘటన. నీటి కాలుష్యం వల్ల కలిగే డయేరియాగా కారణంగా ఇది జరిగి ఉంటుందని వైద్యులు అనుమానిస్తున్నారు. అస్వస్థతకు గురైన వారిలో వాంతులు, వీరేచనాలు, కడుపునొప్పి వంటి లక్షణాలు ఉన్నాయని వైద్యులు తెలిపారు. హుగ్లీ జిల్లాలోని సుగంధ గ్రామపంచాయతీ పరిధి డొగచియాలో ఓ వీధి బండి వద్ద బుధవారం చాలా మంది పానీ పూరి తిన్నారు. అయితే వీరంతా సాయంత్రానికే అస్వస్థతకు గురయ్యారట.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక ఆరోగ్య శాఖ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని మెడికల్ సహాయం అందించారు. పలువురి పరిస్థితి తీవ్రంగా ఉండడంతో మరింత ఉత్తమ వైద్య సేవల నిమిత్తం వారిని పెద్ద ఆసుపత్రికి తరలించారు. అస్వస్థతకు గురైన వారు డొగచియా, బహిర్ రనగచా, మకల్టాలా గ్రామాలకు చెందిన వారిగా అధికారులు గుర్తించారు.

కాగా, బయట పానీ పూరి తినే విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ మధ్యే విజయవాడలో పానీ పూరి వల్ల చాలా మందికి టైఫాయిడ్ సోకినట్లు వైద్యులు తెలిపారు. అంటు రోగాలు, వైరల్ జ్వరాలు దీని వల్ల వ్యాపించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. పానీ పూరి బండి ఉన్న పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉన్నాయా లేదా చూసుకోవాలి. కొవిడ్ లాంటి రోగాలు ప్రభలుతున్న ఈ తరుణంలో ఎక్కువగా గుమిగూడే పానీ పూరి బండ్లకు దూరంగా ఉండాలి.

Shashi Tharoor: ఎంపీ శశి థరూర్‌కు ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం

ట్రెండింగ్ వార్తలు