అద్భుతం : వేల కి.మీ.దూరంలో ఉండి రోగికి డాక్టర్ ఆపరేషన్ 

  • Publish Date - March 20, 2019 / 05:43 AM IST

టెక్నాలజీ డెవలప్ మెంట్ రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. ఇది ఎంతగా అభివృద్ధి చెందిందీ అంటే.. పేషెంట్ ఎక్కడో ఉన్నాడు..డాక్టర్ 3 వేల కిలో మీటర్ల దూరంలో ఉన్నాడు..కానీ పేషెంట్ కు ఆ డాక్లర్ సక్సెస్ ఫుల్ గా ఆపరేషన్ చేసేసాడు..ఇదెలా సాధ్యం? అనే అతి పెద్ద ప్రశ్న రాక మానదు కదూ..మీక్కూడా అనుమానం వచ్చేసింది కదూ..మరి అదెలాగో తెలుసుకుందాం..
 

శాస్త్ర సాంకేతిక రంగాల్లో అగ్రరాజ్యాలకు సైతం సవాల్ విసురుతున్న చైనా కనీవినీ ఎరుగని..కనీసం కలలో కూడా ఊహించని అద్భుతాన్ని సాధించింది. బీజింగ్ లోని ఓ ప్రవైటే అస్పత్రిలో ఉన్న రోగి (పేషెంట్)కి బ్రెయిన్ కు సంబంధించిన ఆపరేషన్ జరగాల్సి ఉంది. కానీ ఆ సమయానికి ఆపరేషన్ చేయాల్సిన సీనియర్ డాక్టర్ రాలేకపోయారు. కానీ ఆపరేషన్ మాత్రం జరిగింది. వేరే డాక్టర్ తో మాత్రం కాదు. 3 వేల కిలోమీటర్ల దూరం నుంచి 5జీ రిమోట్ హ్యాండ్ సహాయంతో ఆ ఆపరేషన్ ను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేశారు సదరు డాక్టర్. ఈ రీతిలో ఓ ఆపరేషన్..అదికీ బ్రెయిన్ కు సంబంధించిన అతి కీలక ఆపరేషన్  జరగడం ప్రపంచ వైద్య చరిత్రలో ఇదే తొలిసారి. ఈ అరుదైన ఘనతను లింగ్ జీపీ అనే వైద్యుడు ఈ  సొంతం చేసుకున్నారు. 

ఆపరేషన్ థియేటర్ లో ఉన్న అన్ని పరికరాలను బీజింగ్ కు సుదీర్ఘ దూరంలోని హైనన్ ద్వీపం నుంచి ఆపరేట్ చేస్తూ..పేషెంట్ మెదడులోకి ‘బ్రెయిన్ పేస్ మేకర్’ ను ఎక్కించే పనిని విజయవంతంగా పూర్తి చేసి..‘పార్కిన్సన్’ వ్యాధితో బాధపడుతున్న రోగికి స్వాంతన చేకూర్చారు.చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ సంస్థ హవాయీ తయారు చేసిన 5జీ సాంకేతికతతో అనుసంధానమైన కంప్యూటర్, రోబోట్ల ద్వారా ఈ పని పూర్తయింది. అయితే, ఈ పరిజ్ఞానాన్ని వాణిజ్యపరంగా హాస్పిటల్స్ లో వాడేందుకు ఇంకొంత సమయం పట్టవచ్చని వైద్య రంగ నిపుణులు అంటున్నారు. వినటానికే కాదు..ఊహకు కూడా అందని ఈ అరుదైన..అద్భుతమైన ఘటనతో వైద్య చరిత్రలో పెను మార్పులు సంభవిస్తాయనటంలో ఎటువంటి సందేహం లేదు.