కోహ్లీ లాంటి వెజిటేరియన్ ప్లేయర్ల ఆహారమిదే

చాలా మంది బాడీ బిల్డింగ్ చేయాలంటే కచ్చితంగా నాన్ వెజ్ తీసుకోవాల్సిందే అనుకుంటారు. కానీ, నాన్ వెజ్‌కు దూరంగా ఉండటం వల్ల జీవిత కాలం పెరగడంతో పాటు గుండె పని తీరు.. రక్త సరఫరా సునాయాసంగా జరుగుతాయని చెబుతున్నారు నిపుణులు. ఎక్కువ సేపు శ్రమించే పనులు నాన్ వెజ్ తోనే సాధ్యమనుకుంటున్న వారికి సమాధానంగా వెజిటేరియన్ డైట్ తోనూ సాధించొచ్చని ప్రూవ్ చేశారు వరల్డ్ టాప్ 5ప్లేయర్లు.

మరి మీరు మెచ్చిన ప్లేయర్ డైట్ గురించి నచ్చిన టిప్స్ తెలుసుకోండిలా:

బాక్సర్ సుశీల్ కుమార్:
మిగతా అథ్లెట్లకు ఫిట్ నెస్ ఉంటే సరిపోతుంది కానీ బాక్సర్లకు కండబలం కూడా కావాలి. మరి అలాంటిది కండల కోసం ఈ సుశీల్ పూర్తిగా వెజిటేరియన్ డైటే ఫాలో అయ్యేవాడంట. ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలా చెప్పుకొచ్చాడు. గుడ్లు కూడా లేకుండా బరువును ఎక్కువ తక్కువలు లేకుండా చూసుకుంటాడు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో గ్లాసు పాలు మొక్కజొన్న గింజలు, వెన్నపూసిన బ్రెడ్, బాదంపప్పులు. లంచ్, డిన్నర్లలో ఏవైనా కూరగాయలతో పాటు ప్రొటీన్ కోసం మీగడ, మల్టీ విటమిన్లు ఉన్న ఫుడ్ తీసుకుంటాడు. 

 

విరాట్ కోహ్లీ; 
2019ని సంచనలంగా ముగించిన ప్లేయర్లలో విరాట్ ముందుననాడు. బ్యాట్ తో మెరుపులు కురిపించడమే కాకుండా.. ఆల్ టైం సక్సెస్‌ఫుల్ టెస్ట్ కెప్టెన్ గా  దూసుకుపోతున్నాడు. 2018లోనే నాన్ వెజ్ కు గుడ్ పై చెప్పేసిన కోహ్లీ.. ఫిట్ నెస్ తో పాటు మంచి ఫిజిక్ ను మెయింటైన్ చేస్తున్నాడు. ‘ఓ అథ్లెట్ గా వెజిటేరియన్ ఫుడ్ తీసుకుంటే ఇంత బెనిఫిట్ పొందుతాననుకోలేదు. వెజిటేరియన్ గా మారకముందు వరకూ ఇంత బెటర్ గా ఎప్పుడూ అనిపించలేదు’ అని కోహ్లీ చెప్పాడు. 

సెరెనా విలియమ్స్:
ఓ బిడ్డకు తల్లి అయిన తర్వాత కూడా మళ్లీ టెన్నిస్‌లో అడుగుపెట్టి అరాచకం చేస్తుంది సెరెనా. 20ఏళ్లుగా టెన్నిస్ లో రాణిస్తున్న సెరెనా విలియమ్స్ తాను నాన్ వెజిటేరియన్‌ను సోదరి అవస్థను చూసి మానేసిందట. వీనస్ విలియమ్స్‌కు వ్యాధి నిరోధక శక్తిపై తరచూ అటాక్ చేసే వ్యాధి వచ్చినప్పటి నుంచి మాంసాహారానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. ఇప్పుడు ఆమె ఆహారంలో ఎక్కువగా ఆకుకూరలే ఉంటాయని చెప్తుంది. ఉదయం ఓట్స్, ఫ్రూట్, బాదంపప్పులు, వెన్న. మధ్యాహ్నం ఆకుకూరలతో సలాడ్, డిన్నర్ కోసం బ్రౌన్ రైస్ తో ఏదైనా కూర.

నొవాక్ జకోవిచ్:
టెన్నిస్ సంచలనం జకోవిచ్.. 2019 సమ్మర్‌లో ఐదో వింబుల్డన్ టైటిల్ గెలుచుకున్నాడు. 8సార్లు చాంపియన్ రోజర్ ఫెదరర్ తో నాలుగు గంటల 57నిమిషాలు అలుపెరగకుండా పోరాడి సుదీర్ఘ వింబుల్డన్ సింగిల్స్ ఫైనల్ చరిత్రలో నిలిచిపోయేలా చేశాడు. విమర్శకులు సైతం జకోవిచ్ వెజిటేరియన్ గా మారిన తర్వాత ఆటతీరులో మార్పు చూసి షాక్ అయ్యారు. 

దీనిపై మాట్లాడిన జకోవిచ్.. నా డైట్ ఆటను మాత్రమే కాదు. నా జీవితాన్నే మార్చేసింది. నా వృత్తిపరమైన జీవితాన్ని ఇంత మారుస్తుందనుకోలేదు. కోర్టులో నా శరీరాన్ని మరింత యాక్టివ్ చేసింది. శరీరంలో టాక్సిన్ మొత్తాన్ని తొలగించేశానుకుంటున్నాను. 

సునీల్ ఛెత్రి:
టీమిండియా ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రి ఓ ఇంటర్వ్యూలో తాను నాన్ వెజ్ ను ఎందుకు మానేశాడో వెల్లడించాడు. జంతువులను చంపడం కారణంగా గ్లోబల్ వార్మింగ్ జరుగుతుందని అది తనను చాలా బాధిస్తుందని మానేశాడట. వెజిటేరియన్ గా మారిన తర్వాత మైదానంలో మరింత ఆరోగ్యంగా ఉన్నట్లు అనిపిస్తుందన్నాడు. 

మరి మైదానంలో అంత యాక్టివ్ గా తిరుగుతున్న ప్లేయర్లే ఫాలో అవుతున్నప్పుడు వెజిటేరియన్ ఫుడ్ మనమూ ఓ సారి ట్రై చైద్దాం అనిపిస్తుందా.. గో ఎ హెడ్.. ఆల్ ద బెస్ట్. 

ట్రెండింగ్ వార్తలు