Banana Disadvantages: రోజూ అరటిపండు తింటున్నారా? షుగర్ వచ్చే ప్రమాదం ఉంది.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

అరటిపండు(Banana Disadvantages) సహజమైన, పోషకాలతో నిండిన ఆరోగ్యకరమైన పండు. ఇందులో విటమిన్ B6, పోటాషియం, మ్యాగ్నీషియం,

Banana Disadvantages: Is there a risk of diabetes from eating a banana a day?

Banana Disadvantages: అరటిపండు సహజమైన, పోషకాలతో నిండిన ఆరోగ్యకరమైన పండు. ఇందులో విటమిన్ B6, పోటాషియం, మ్యాగ్నీషియం, కార్బోహైడ్రేట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. అందుకే, వ్యాయామం, జిమ్ చేసే వారు ఎక్కువగా అరటిపండు తింటారు. నిజానికి చాలా మందికి ఈ పండు రోజువారీ ఆహారంలోప్ భాగంగా కూడా ఉంటుంది. అయితే, ప్రతిరోజూ నియంత్రణ లేకుండా అరటిపండు తినడం వల్ల కొన్ని ఆరోగ్య సంబంధిత సమస్యలు(Banana Disadvantages) తలెత్తే ప్రమాదం ఉందట. మరి ఆ సమస్యలు ఏంటి అనేది ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

1. బరువు పెరగడం:
అరటిపండులో కార్బోహైడ్రేట్లు, నేచురల్ షుగర్స్ (ఫ్రుక్టోస్, గ్లూకోజ్) పుష్కలంగా ఉంటాయి. కాబట్టి, రోజూ 2 లేదా అంతకన్నా ఎక్కువ అరటిపండ్లు తినడం వల్ల అధిక కేలరీలు శరీరంలోకి చేరతాయి. దీనివల్ల బరువు పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ తినాలి అనుకుంటే మాత్రం ఒకటికి మించి తినకూడదు. ముఖ్యంగా రాత్రిపూట అరటిపండు తినకపోవడం ఉత్తమం.

2.బ్లడ్ షుగర్ స్థాయిల పెరుగుదల:
అరటిలో సహజ చక్కెర అధికంగా ఉంటుంది. దీనిని శరీరం వేగంగా గ్రహింస్తుంది. ఇలా జరగడం వల్ల షుగర్ లెవల్స్ పెరిగి దీర్ఘకాలిక సమస్యగా మారవచ్చు. కాబట్టి, మధుమేహ రోగులు కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది.

3.మలబద్ధకం:
అరటిపండులో ఫైబర్ తక్కువగా ఉంటుంది. కాబట్టి, ఇది జీర్వవ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. ఫలితంగా మలబద్దకం సమస్య వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి, తక్కువ నీరు తాగే వారు, తక్కువ ఫైబర్ తీసుకునేవారు అరటిపండుకు దూరంగా ఉండటం మంచిది.

4.పోటాషియం అధికం:
అరటిపండులో పోటాషియం అధికంగా ఉంటుంది. రోజుకు 2 నుంచి 3 అరటిపండ్లు తింటే శరీరంలో పోటాషియం లెవెల్ ప్రమాదకరంగా పెరగవచ్చు. దీనివల్ల అలసట, హృదయ స్పందన అసమాన్యత, గుండె సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు. కాబట్టి, గుండె రోగులు, వృద్ధులు, కిడ్నీ వ్యాధిగ్రస్తులు అరటిని తీసుకోవడం మానేయడం మంచిది.

5.అలసట & నిద్ర మత్తు:
అరటిపండులో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉండటం వల్ల శరీరంలో సెరోటోనిన్, మెలటోనిన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇవి నిద్రను ప్రేరేపిస్తుంది. ఎక్కువగా అరటిపండ్లు తినడం వల్ల అలసట, ఉత్సాహం లోపం లాంటి సమస్యలు తలెత్తవచ్చు. కాబట్టి, ఉదయం కాకుండా మధ్యాహ్నం లేదా పని వేళ తినడం మంచిది.

అరటిపండు ఆరోగ్యానికి మేలు చేసే పండు అయినా అధికంగా తీసుకోవడం హానికరం. ప్రతి రోజు సరైన పరిమాణంలో (ఒకటి లేదా గరిష్టం రెండు) తీసుకోవడం మేలు చేస్తుంది. మధుమేహం, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు వైద్య సలహా మేరకు అరటిపండు తినడం మంచిది.