Pre Diabetic Signs: ఈ లక్షణాలు కనిపించాయా? బీకేర్ ఫుల్.. మీరు ప్రీ-డయాబెటిక్ అని సూచించే 6 సంకేతాలు ఇవే..!

మీరు డయాబెటిస్ కు ముందు దశలో ఉన్నారని మీకు తెలియకపోవచ్చు. కొన్ని సంకేతాల ద్వారా ఈ విషయాన్ని గ్రహించవచ్చని.. (Pre Diabetic Signs)

Pre Diabetic Signs: మీలో ఈ లక్షణాలు కనిపించాయా? అయితే బీకేర్ ఫుల్.. అది ప్రీ డయాబెటిక్ కావొచ్చు. వెంటనే డాక్టర్ ను సంప్రదించాల్సి ఉంటుంది. మీరు డయాబెటిస్ కు ముందు దశలో ఉన్నారని మీకు తెలియకపోవచ్చు. కొన్ని సంకేతాల ద్వారా ఈ విషయాన్ని గ్రహించవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. ప్రీ డయాబెటిక్ అని సూచించే 6 సంకేతాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

అధిక దాహం, అధికంగా మూత్రం పోవడం: ప్రీ డయాబెటిస్ ప్రారంభ సంకేతాలలో ఒకటి పాలీడిప్సియా (అధిక దాహం). మరొకటి అధికంగా మూత్రం పోవడం. రక్తంలో షుగర్ పెరగడం వల్ల మీ మూత్రపిండాలు గ్లూకోజ్‌ను ఫిల్టర్ చేయడానికి, గ్రహించడానికి అధికంగా పని చేయాల్సి పరిస్థితి ఏర్పడుతుంది. ఇది డీ హైడ్రేషన్ కు దారితీస్తుంది.

తీవ్రమైన అలసట: బాగా నిద్ర పోయిన తర్వాత కూడా అలసటగా అనిపిస్తుంది. ఇది గ్లూకోజ్ నియంత్రణ సరిగా లేదనే విషయాన్ని సూచిస్తుంది. ఎప్పుడైతే మీ శరీరం శక్తి కోసం షుగర్ ను సమర్ధవంతంగా ఉపయోగించలేదో అప్పుడు కణాలు అలసిపోతాయి. ఇది రోజంతా అలసటగా, బద్ధకంగా ఉంచుతాయి.

గాయాలు నెమ్మదిగా నయం కావడం: కోతలు, గాయాలు లేదా ఇన్ఫెక్షన్లు నయం కావడానికి సాధారణం కంటే ఎక్కువ సమయం పడుతుంది. ఇది మరొక సంకేతం. బ్లడ్ సర్కులేషన్ బలహీనపడటం, రక్తంలో షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది జరగొచ్చు.

చూపులో అస్పష్టత: రక్తంలో షుగర్ లెవెల్స్ లో హెచ్చుతగ్గులు ఉండటం కంటి లెన్స్‌లో తాత్కాలిక వాపునకు కారణమం అవుతాయి. దీని వలన చూపు అస్పష్టంగా ఉంటుంది. కంటి చూపు మసకగా ఉంటుంది. ఇలా తరచుగా జరుగుతోంది అంటే.. మీ గ్లూకోజ్ లెవెల్స్ అస్థిరంగా ఉందని చెప్పడానికి ఇదొక సంకేతం.

పాదాలలో జలదరింపు లేదా తిమ్మిరి: నరాలు దెబ్బతింటాయి. ఇది డయాబెటిస్ కు ముందు దశ. చేతులు కాళ్ళలో జలదరింపు, తిమ్మిరి లేదా మంట కలుగుతుంది. అధిక షుగర్ లెవెల్స్ మీ నరాలను ప్రభావితం చేస్తుందని చెప్పే హెచ్చరిక సంకేతం ఇది.

బరువులో మార్పులు: విపరీతంగా బరువు పెరగడం. మన జీవనశైలిలో ఎలాంటి మార్పులు లేకుండానే ఆకస్మికంగా బరువు పెరగడం లేదా తగ్గడం. ఈ రెండూ కూడా ప్రీ-డయాబెటిస్‌ను సూచిస్తాయి. ఇన్సులిన్ నిరోధకత బొడ్డు ప్రాంతంలో కొవ్వు ఏర్పడటానికి దారితీస్తుంది. ఇది డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది.

Also Read: రైస్ కుక్కర్ లో వంట ప్రమాదం తెలుసా? ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి