Papaya fruit benefits
మనం తినే పండ్లలో బొప్పాయి పండుకున్న ప్రత్యక ఏంటో తెలుసా? ఈ పండ్లు మాత్రమే ఏడాది పొడవునా లభిస్తాయి. అందుకే ఈ పండ్లను చాలా మంది ఇష్టంగా తింటారు. కానీ, నిపుణులు చెప్తున్నా మాట ఏంటంటే.. బొప్పాయి పండ్లను వర్షాకాలంలో మాత్రం తప్పకుండ తినాలట. దానికి కారణాలు లేకపోలేదు. వర్షాకాలంలో బొప్పాయి పండ్లను తినడం వల్ల అనేక లాభాలు ఉన్నాయట. బొప్పాయి పండ్లలో ఉండే పపైన్, కైమో పపైన్ అనే ఎంజైమ్ లు జీర్ణ రసాలు ఉత్పత్తి అయ్యేలా చేసి జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. మనం తినే ఆహారంలో ఉండే ప్రోటీన్లు, కొవ్వులను జీర్ణం చేయడంలో ఇవి సహాయపడతాయి. నిజానికి వర్షాకాలంలో మన జీర్ణ వ్యవస్థ పనితీరు కాస్త మందగిస్తుంది. బొప్పాయి పండ్లను తినడం వల్ల జీర్ణ వ్యవస్థను యాక్టివ్ అవుతుంది. ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. అంతేకాకుండా.. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
బొప్పాయి పండ్లు కేవలం జీర్ణ వ్యవస్థనే కాదు.. శరీరంలోని నొప్పులు, వాపుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఈ పండ్లలో ఉండే యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు నొప్పులు, వాపులను తగ్గించడంలో మంచి ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ పండ్లలో ఉండే విటమిన్లు ఎ, సి, ఇ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. వర్షాకాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల చర్మం డల్‌గా మారుతుంది. దురదలు వచ్చే అవకాశం కూడా ఉంది. అలాంటి సమస్యలకు బొప్పాయి మెరుగ్గా పనిచేస్తుంది. బొప్పాయి పండు ఫేస్ ప్యాక్ చేసుకొని వాడటం వల్ల ముఖం కాంతివంతంగా మారుతుంది.
వర్షాకాలంలో మనం తీసుకునే ఆహరం వల్ల ఫుడ్ పాయిజనింగ్, ఫుడ్ ఇన్ఫెక్షన్స్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ, బొప్పాయి ఫుడ్ ఇన్ఫెక్షన్ ను నివారిస్తుంది. విరేచనాలు కూడా తగ్గుతాయి. పొట్టలో ఉండే నులి పురుగులు సైతం నశిస్తాయి. మలబద్దకం ఉన్నవారికి బొప్పాయి మంచి ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. ఈ పండ్లను తినడం వల్ల పేగుల్లో ఉండే మలం పూర్తిగా బయటకు వచ్చేస్తుంది. బొప్పాయి పండ్లలో విటమిన్ సి, విటమిన్ ఇ, ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి వర్షాకాలంలో ఎక్కువగా వచ్చే ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. ఈ పండులో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచి వ్యాధుల బారిన పడకుండా కాపాడుతాయి.
బొప్పాయి పండ్లలో ఉండే ఎంజైమ్‌లు జీవక్రియలను సరిగ్గా నిర్వహించడంలో సహాయం చేస్తాయి. దీంతో క్యాలరీలు సులభంగా ఖర్చవుతాయి. బరువు తగ్గాలనే డైట్‌లో ఉన్నవారు బొప్పాయి పండ్లను రోజూ తింటుంటే ఫలితం ఉంటుంది. ఇంకా ఈ పండ్లు కంటి ఆరోగ్యానికి, షుగర్ కంట్రోలింగ్ కి చాలా సహాయపడతాయి. కాబట్టి బొప్పాయి పండ్లను వర్షాకాలంలో ఎక్కువగా తినడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.