Yoga For Women: నెలసరి, PCOD, ధైరాయిడ్.. ఏ సమస్యకు ఏ యోగాసనాలు మంచివి.. ఫుల్ డిటెయిల్స్

ఆడవాళ్ళ జీవితంలో యోగా కీలక పాత్ర పోషిస్తుంది. వారికి శారీరక, మానసిక, భావోద్వేగ, ఆధ్యాత్మిక శక్తిని అందించే ఒక శక్తివంతమైన సాధనంగా ఉపయోగపడుతుంది.

Ladies doing yoga

ఆడవాళ్ల జీవితం చాలా ప్రత్యేకం. ఆమె జీవితం అనేక పాత్రలతో నిండి ఉంటుంది. తల్లి, భార్య, సంసార, వైవాహిక, ఉద్యోగిని ఇలా ప్రతీ విభాగంలో ఆమె పాత్ర కీలకం. ఇన్ని బాధ్యతల మధ్య ఆమె ఆరోగ్యం, మానసిక స్థితి నిర్లక్ష్యం చేయబడుతూ ఉంటుంది. అలాంటి ఆడవాళ్ళ జీవితంలో యోగా కీలక పాత్ర పోషిస్తుంది. వారికి శారీరక, మానసిక, భావోద్వేగ, ఆధ్యాత్మిక శక్తిని అందించే ఒక శక్తివంతమైన సాధనంగా ఉపయోగపడుతుంది. ఆడవాళ్ళలో సాధారణంగా కనబడే PCOD ప్రాబ్లమ్స్, మెన్స్ట్రువల్ క్రాంప్స్, మెనోపాజ్ సమస్యలు, థైరాయిడ్, ఒత్తిడి, ఆత్మవిశ్వాస లోపం, నిద్రలేమి, ఆందోళన ఇలా ప్రతీ సమస్యకు యోగ అద్భుతమైన ప్రయోజనాలను అందజేస్తుంది.

ఆడవాళ్లకు యోగం ఇచ్చే ముఖ్య ప్రయోజనాలు

PCOS/PCOD నియంత్రణ; ఆడవాళ్ళకి సాదరంగా కనిపించే సమస్య. ఈ మధ్య కాలంలో ఈ సమస్యతో బాధపడుతున్నవారు చాలా మందే ఉన్నారు. అలాంటి వారికి యోగాలో ఉండే కొన్ని ఆసనాల ద్వారా ఉపశమనం కలుగుతుంది. వాటిలో బద్ధకోణాసన, శశాంకాసన, సుర్యనమస్కారాలు ప్రత్యేకం. ఈ ఆసనాలు హార్మోన్ల సమతుల్యతకు, శరీర బరువును తగ్గించి మూల కారణాన్ని అదుపులోకి తీసుకురావడంలో సహాయపడతాయి.

మెన్స్ట్రువల్ సమస్యకి ఉపశమనం: ఆడవాళ్ళలో నెలసరి సమయంలో రక్తశ్రావం, కడుపునొప్పి అవడం సహజమే. కానీ, కొంతమందిలో ఇది ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్య ఉన్నవారు యోగ చేయడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. యోగా వల్ల రక్త ప్రసరణ మెరుగై నొప్పులు తగ్గుతాయి. ప్రాణాయామం చేయడం వల్ల ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత కలుగుతుంది.

గర్భధారణకు సన్నద్ధత: ఈ మధ్య కాలంలో చాలా మంది సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారు. అలాంటి వారిని యోగా గర్భధారణకు శరీరం, మనస్సు సిద్ధం చేస్తుంది. ఆరోగ్యకరమైనా అండాలు, రక్తప్రసరణ జరిగేలా చేస్తుంది. గర్భం సమయంలో ధ్యానం, ప్రాణాయామం చేయడం వల్ల గర్భిణీకి నిగ్రహం, ధైర్యం కలుగుతాయి.

మెనోపాజ్ తర్వాత ఆరోగ్యం: ఆడవాళ్ళలో ఋతుచక్రం ఆగిపోవడాన్ని మెనోపాజ్ అంటారు. ఆ సమస్యంలో ఆడవాళ్లు యోగా అలవాటు చేసుకోవడం వల్ల బోన్ డెన్సిటీ కాపాడటం, ఒత్తిడిని తగ్గించడం జరుగుతుంది. హాట్ఫ్లాష్‌లను నియంత్రించడం, నిద్రలేమి సమస్యను దూరం చేస్తుంది.

మానసిక ఆరోగ్యం: ఆడవాళ్లు ఒకటికి మించి పనులల్లో భగసామ్యం అవుతారు కాబట్టి వారి ఎక్కువగా ఒత్తిడికి లోనవుతుంటారు. వారికి ధ్యానం, ప్రాణాయామం చేయడం వల్ల మంచి ఉపశమనం కలుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకునే సామర్థ్యం లభిస్తుంది.

బరువు నియంత్రణ: బరువు నియంత్రణలో సుర్యనమస్కారాలు, పవన ముక్తాసన, నౌకాసన వంటి ఆసనాలు సహాయ పడతాయి.

మహిళల కోసం ప్రత్యేకమైన యోగాసనాలు

  • బద్ధకోణాసనం – పెల్విక్ ఆరోగ్యానికి మంచిది
  • శశాంకాసనం – ఒత్తిడిని తగ్గిస్తుంది, నిద్రకు మంచిది
  •  భుజంగాసనం – బలమైన వెన్నెముకకు, హార్మోన్ల సమతుల్యతకు
  • నౌకాసనం – అబ్డొమినల్ ఫాట్ తగ్గించడంలో సహాయపడుతుంది
  • ఉష్ట్రాసనం – థైరాయిడ్ సమస్యలకు ఉపయోగకరం
  • అనంతాసనం – గర్భిణీ స్త్రీలకు విశ్రాంతిని ఇస్తుంది

ఆడవాళ్లకు యోగ అనేది ఒక దివ్యమైన సాధనం. ఇది శరీరాన్ని శక్తివంతంగా, మనస్సును ప్రశాంతంగా, ఆత్మను ప్రశాంతతగా మార్చుతుంది. జీవితానికే ఒక కొత్త దిశను ఇస్తుంది.