Yoga Mudras: యోగాలో ఈ ఒక్క ముద్రతో మీరు రప్పా రప్పా వెయిట్ లాస్.. ఏ ముద్రతో ఏం బెనిఫిట్సో చూడండి.

Yoga Mudras: యోగముద్రలు శరీరంలోని ప్రాణశక్తిని నియంత్రించే శక్తివంతమైన సాధనాలు. ఇవి వేళ్ల దశ, శరీర భంగిమ, శ్వాస నియంత్రణ వంటి అంశాల ద్వారా మన శరీర, మనస్సు, ప్రాణ శక్తులను సమన్వయం చేస్తాయి.

Types of Yoga mudras

యోగా అంటే చాలా మంది ఆసనాలు అనే అనుకుంటారు. కానీ, ఇందులో ముద్రలు కూడా ఉంటాయి. యోగముద్రలు శరీరంలోని ప్రాణశక్తిని నియంత్రించే శక్తివంతమైన సాధనాలు. ఇవి వేళ్ల దశ, శరీర భంగిమ, శ్వాస నియంత్రణ వంటి అంశాల ద్వారా మన శరీర, మనస్సు, ప్రాణ శక్తులను సమన్వయం చేస్తాయి. ఈ ముద్రల వల్ల చాలా రకాల ఆరోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. మరి యోగాలో ఉండే ఆ ముద్రలు ఏంటి? ఏ ఏ ముద్ర ఎలా పని చేస్తుంది? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

అసలు ముద్రలు అంటే ఏమిటి?

ముద్ర అనే పదానికి సీల్ లేదా శక్తిని ముద్రించడం అని అర్థం. యోగా, ప్రాణాయామం, ధ్యానం వంటి సాధనల్లో ముద్రలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. వీటికి శరీరంలోని శక్తి ప్రవాహాన్ని ఒక నిర్దిష్ట దిశలోకి మళ్లించగలిగే శక్తి ఉంటుంది.

ముఖ్యమైన ముద్రలు & వాటి ప్రయోజనాలు:

జ్ఞాన ముద్ర: ఈ ముద్రలో బొటనవేళు + చూపుడు వేళి కలిపి వృత్తం లాగా ఉంచాలి. ఈ ముద్ర జ్ఞానానికి, ఏకాగ్రతకు, మెదడు పనితీరుకు సహాయపడుతుంది.

ప్రాణ ముద్ర: ఈ ముద్రలో బొటనవేళు + చిన్నవేళు + ఉంగర వేళు కలిపి ఉంచాలి. ఇది శరీరంలో ప్రాణశక్తిని ఉత్తేజితపరుస్తుంది. అలసట, శక్తి లోపం ఉన్నవారికి చాలా బాగా సహాయపడుతుంది. దృష్టి శక్తిని మెరుగుపరుస్తుంది.

వాయు ముద్ర: ఈ ముద్రలో చూపుడు వేళిని బొటనవేళితో వంచి నొక్కాలి. ఇలా చేయడం వల్ల శరీరంలోని వాయు తత్వాన్ని నియంత్రించవచ్చు. జాయింట్ పెయిన్స్, గ్యాస్, ఉబ్బసం వంటి సమస్యలకు ఉపశమనం కలుగుతుంది.

ఆకాశ ముద్ర: ఈ ముద్రలో మధ్యవేళు + బొటనవేళు కలిపి ఉంచాలి. ఈ ముద్ర వల్ల ఒత్తిడి దూరమై మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ధ్యానంలో లోతైన స్థితికి చేరుకునేందుకు ఈ ముద్ర ఉపయోగపడుతుంది. శరీరంలోని విషపదర్థాలను బయటకు పంపేందుకు సహాయపడుతుంది.

అగ్ని లేదా సూర్య ముద్ర: ఈ ముద్రలో ఉంగరవేళిని బొటనవేళితో వంచి నొక్కాలి. ఇది జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది. కొవ్వు కరిగించడంలో సహాయపడుతుంది. చలితో సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది.

జల ముద్ర: ఈ ముద్రలో బొటనవేళు + చిన్నవేళు కలిపి ఉంచాలి. ఈ ముద్ర శరీరంలోని నీటి శాతాన్ని సమతుల్యం చేస్తుంది. చర్మ సమస్యలు, నీరసం వంటి సమస్యలను దూరం చేస్తుంది.

శూన్య ముద్ర: ఈ ముద్రలో మద్యవేళిని బొటనవేళితో వంచి నొక్కాలి. ఈ ముద్ర వల్ల వినికిడి సంబందించిన సమస్యలను దూరం చేయవచ్చు. తాత్కాలిక మూర్ఛ, తల తిరుగుడు వంటి సమస్యలకు ఉపయోగపడుతుంది.

హృదయ ముద్ర: ఈ ముద్రలో చూపుడు వేళి మడిచి ఉంచి, మిగతా మూడింటినీ కలిపి ఉంచాలి. ఇలా చేయడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్తప్రసరణ సరిగా జరుగుతుంది. హృదయ సంబంధిత సమస్యలు రాకుండా చేస్తుంది.

ఈ ముద్రలను ఏ సమయంలో, ఎంతసేపు చేయాలి?

  • రోజులో కనీసం 15–30 నిమిషాలు ముద్రలు అభ్యాసించాలి.
  • ఖాళీ కడుపుతో లేదా తేలికపాటి భోజనానంతరం చేయాలి.
  • ధ్యానం లేదా ప్రాణాయామం సమయంలో ముద్రలతో కలిపి చేస్తే ఇంకా మంచి ఫలితం ఉంటుంది.
  • మంచి ఫలితం కోసం ఒకే ముద్రను కనీసం 21 రోజులు చేయాలి.

ముద్రలు చేస్తే ఏమవుతుంది?

  • ప్రాణశక్తి పెరుగుతుంది
  • ఆరోగ్య సమస్యల తగ్గుదల
  • మానసిక ప్రశాంతత
  • ధ్యాన సామర్థ్యం, ఏకాగ్రత పెంపు
  • ఆత్మ నియంత్రణ అభివృద్ధి