Sugar patients Food Diet
ప్రెజెంట్ జనరేషన్ లో మధుమేహం వ్యాధి బారిన పడుతున్నవారు సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. దీనికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. ఆహారపు అలవాట్లు, జీవన విధానంలో మార్పులు, ఒత్తిడి ఇలా చాలా రకాల కారణాల వల్ల షుగర్ వ్యాధి వ్యాప్తి ఘననీయంగా పెరుగుతోంది. అయితే, చాలా మందిలో ఉన్న అపోహ ఏంటంటే మధుమేహానికి మందులు వాడుతున్నాం కదా ఏదైనా తినొచ్చు అని. కానీ, ఇది కొన్ని సందర్భాల్లో అత్యంత ప్రమాదకరం అవుతుంది. మందులు వాడుతున్నప్పటికీ షుగర్ పేషేంట్స్ కొన్ని జాగ్రత్తలు తీసుకోకతప్పదు. మరి ఆ జాగ్రత్తలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
బ్లడ్ షుగర్ హెచ్చుతగ్గులు:
మందులు బ్లడ్ షుగర్‌ను నియంత్రించేందుకు కేవలం పని చేస్తాయి. కానీ, మెడిసిన్ వాడుతున్నాం కదా అని ఎక్కువ షుగర్, కార్బోహైడ్రేట్, ఫ్రైడ్ ఫుడ్స్ తింటే, మందులు ఆ ప్రభావాన్ని తట్టుకోలేకపోతాయి. కాబట్టి అది ప్రమాదకరంగా మారె అవకాశం ఉంది.
హైపోగ్లైసేమియా ప్రమాదం:
కొన్ని మందులు తీసుకుని, తినకుండా ఉన్నా లేదా తినే టైం తప్పితే బ్లడ్ షుగర్ లెవల్స్ చాలా తక్కువ అవుతాయి. దాని వల్ల బెహోష్ అయ్యే ప్రమాదం ఉంటుంది.
బాడీ మీద ఒత్తిడి పెరుగుతుంది:
మందులు బ్లడ్ షుగర్ ను తగ్గిస్తాయి. అయితే మీరు జంక్ ఫుడ్స్ తింటే, లివర్, కిడ్నీ, హార్ట్ మీద ఆధిక ఒత్తిడి ఏర్పడుతుంది. దీర్ఘకాలంలో ఇవి నెఫ్రోపతి, రిటినోపతి, కార్డియాక్ ప్రాబ్లమ్స్ కి దారి తీయవచ్చు.