China’s experimental COVID-19 vaccine : ప్రపంచానికి కరోనాను అంటించిన డ్రాగన్ చైనా ప్రయోగాత్మక కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి చేసేపనిలో పడింది. చైనా ప్రయోగాత్మక కరోనావైరస్ వ్యాక్సిన్ సురక్షిమని అంటోంది.. Chinese Academy of Medical Sciences ఆధ్వర్యంలో Institute of Medical Biology ఈ ప్రయోగాత్మకక వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తోంది.
ఇటీవలే నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్ నిర్వహించగా తొలి దశలో వచ్చిన ఫలితాలతో వ్యాక్సిన్ సురక్షితమని రీసెర్చర్లు వెల్లడించారు. తొలి దశలో 191 మంది ఆరోగ్యకరమైన వాలంటీర్లు పాల్గొన్నారు. వ్యాక్సినేషన్ తీసుకున్న వారిలో 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మధ్య వయస్సు వారే ఉన్నారు.
ఈ ప్రయోగాత్మక వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఎవరికి ఎలాంటి తీవ్ర ప్రతికూల ఫలితాలేమి రాలేదని పరిశోధకులు వెల్లడించారు. క్లినికల్ ట్రయల్స్ లో పాల్గొన్న వారిలో దాదాపు ప్రతికూల ఫలితాలు స్వల్పంగానే కనిపించాయన్నారు.
అందులో వ్యాక్సినేషన్ వేసిన చోట చర్మంపై స్వల్పంగా నొప్పి, కొద్దిగా అలసట, ఎర్రబారడం, దురద, వాపు వంటి దుష్ప్రలితాలు కనిపించాయని పరిశోధకులు తెలిపారు. వీరిలో వ్యాధినిరోధకత కూడా సరైన స్థాయిలో స్పందించిందని పేర్కొన్నారు. చైనాలో కనీసంగా నాలుగు ప్రయోగాత్మక వ్యాక్సిన్లు చివరి దశ క్లినికల్ ట్రయల్స్ లో ఉన్నాయి.