Bharat Biotech’s nasal vaccine: కొవిడ్‭పై పోరాటంలో భారత్ మరింత శక్తిమంతం.. ‘ముక్కు’ టీకా వినియోగానికి డీసీజీఐ అనుమతి

భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన ముక్కు ద్వారా వేసే వ్యాక్సిన్‌ (నాజల్‌ వ్యాక్సిన్‌) అత్యవసర వినియోగానికి భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) అనుమతి ఇచ్చింది. ఇప్పటికే ఈ వ్యాక్సిన్ కు సంబంధించిన క్లినికల్‌ ట్రయల్స్‌ పూర్తయిన విషయం తెలిసిందే. ఈ టీకా క్లినికల్ ట్రయల్స్ ను 18 నుంచి 60 ఏళ్ళ మధ్య వయసు ఉన్న వారిపై నిర్వహించారు. ఇప్పటికే భారత్ బయోటెక్ ‘కొవాగ్జిన్‌’ టీకాను అభివృద్ధి చేసింది.

Bharat Biotech’s nasal vaccine: భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన ముక్కు ద్వారా వేసే వ్యాక్సిన్‌ (నాజల్‌ వ్యాక్సిన్‌) అత్యవసర వినియోగానికి భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) అనుమతి ఇచ్చింది. ఇప్పటికే ఈ వ్యాక్సిన్ కు సంబంధించిన క్లినికల్‌ ట్రయల్స్‌ పూర్తయిన విషయం తెలిసిందే. ఈ టీకా క్లినికల్ ట్రయల్స్ ను 18 నుంచి 60 ఏళ్ళ మధ్య వయసు ఉన్న వారిపై నిర్వహించారు. ఇప్పటికే భారత్ బయోటెక్ ‘కొవాగ్జిన్‌’ టీకాను అభివృద్ధి చేసింది. భారత్ సహా పలు దేశాల్లో దీన్ని వినియోగిస్తున్నారు.

బీబీవీ154- అడెనోవైరస్‌ వెక్టార్డ్‌ ఇంట్రానాసల్‌ వ్యాక్సిన్‌ (ముక్కు టీకా) కోసం కొన్ని నెలలుగా భారత్ బయోటెక్ కృషి చేసింది. అమెరికాలోని వాషింగ్టన్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ ఇన్‌ సెయింట్‌ లూయీస్‌తోనూ ఒప్పందం కుదుర్చుకుంది. నాజల్‌ వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి అనుమతులు వచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ కూడా ఓ ప్రకటనలో తెలిపారు.

కొవిడ్-19కి వ్యతిరేకంగా భారత పోరాటానికి ఇది మరింత ప్రోత్సాహం ఇస్తుందని అన్నారు. 18 ఏళ్ల పైబడిన వారి కోసం భారత్ బయోటెక్ నాజల్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి కేంద్రం కూడా ఆమోదించిందని అన్నారు. ఈ వ్యాక్సిన్ కొవిడ్ మహమ్మారిపై మన సమిష్టి పోరాటాన్ని మరింత బలోపేతం చేస్తుందని చెప్పారు. ప్రధాని మోదీ నాయకత్వంలో కరోనాకు వ్యతిరేక పోరాటంలో భారత్ తన శాస్త్రీయ విజ్ఞానాన్ని, మానవ వనరులను సమర్థంగా వినియోగించుకుందని అన్నారు. అందరి సహకారంతో కరోనా ఓడిస్తామమని పేర్కొన్నారు.

Lok Sabha elections 2024: ప్రతిపక్షాల ప్రధాని అభ్యర్థిగా సీఎం నితీశ్ కుమార్.. సీతారాం ఏచూరి ఏమన్నారంటే?

ట్రెండింగ్ వార్తలు