Coronavirus vaccine : ప్రపంచమంతా కరోనా మహమ్మారి వ్యాపించింది. మహమ్మారిని అంతం చేసే వ్యాక్సిన్ కోసం ప్రపంచదేశాల ప్రజలంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది అనేదానిపై ఇప్పటికీ సరైన స్పష్టత లేదు.. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తీపి కబురు అందించింది.
వాస్తవానికి ఈ ఏడాది ఆఖరులో కరోనా వ్యాక్సిన్ వస్తుందని ఆశిస్తున్నామని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ Tedros Adhanom Ghebreyesus ఒక ప్రకటనలో వెల్లడించారు.
అంతేకాదు.. ప్రపంచమంతా కరోనా వ్యాక్సిన్ అన్ని దేశాలకు సమానంగా పంపిణీ జరగాలని దేశాధినేతలను ఆయన కోరారు. కరోనా వ్యాక్సిన్ల పంపిణీలో ప్రత్యేకించి దేశాధినేతల్లో రాజకీయ నిబద్ధత అనేది ప్రధాన సాధనమన్నారు. టీకా అందుబాటులోకి రాగానే అన్ని దేశాలు పరస్పరం సహకరించుకోవాలని టెడ్రోస్ సూచించారు.
వ్యాక్సిన్ అభివృద్ధి, పంపిణీలో సహకారం కోసం కోవాక్స్ పేరిట ప్రపంచ దేశాలు కూటమి కట్టాయి. ఈ కూటమి ఆధ్వర్యంలో 9 కరోనా వ్యాక్సిన్లు అభివృద్ధి దశలో ఉన్నాయి. ఈ ఏడాది చివరికి వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందని టెడ్రోస్ ఆశాభావం వ్యక్తం చేశారు.
సగానికి పైగా బ్రిటన్లకు కరోనా వ్యాక్సిన్ రాబోతుందని, వారిలో పెద్దవాళ్లే ముందుగా ప్రాధాన్యత ఉంటుందని ఒక టాప్ అడ్వైజర్ పేర్కొన్నారు. దీనిపై Kate Bingham కరోనా వ్యాక్సిన్ లభ్యతపై ప్రజలను తప్పుదోవ పట్టించారని చెప్పారు. బ్రిటన్ దేశమంతా పిల్లలతో సహా కరోనా వ్యాక్సిన్ ఇవ్వడం జరగదని ఆమె స్పష్టం చేశారు.