ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. 199 దేశాలకు కరోనా మహమ్మారి వ్యాపించింది. ప్రపంచ దేశాల్లో 28,662 మంది మృతిచెందగా, 6,21,090 మందికి కరోనా సోకినట్టు నిర్ధారించారు. ఇటలీ, అమెరికా, చైనా, స్పెయిన్, జర్మనీ, ఫ్రాన్స్ లో కరోనా తీవ్రంగా విజృంభిస్తోంది. ప్రపంచంలోనే ఇటలీలో అత్యధికంగా కరోనా మరణాలు నమోదయ్యాయి. ఇటలీలో 86,498 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 9,134 మంది మృతిచెందారు. స్పెయిన్ లో 72,248 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 5,690 మంది మృతిచెందారు.
చైనాలో 81, 394 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 3,295 మంది మృతిచెందారు. ఇరాన్ లో 35,408 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 2,517 మంది మృతిచెందారు. ఫ్రాన్స్ లో 32,964 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1,995 మంది మృతిచెందారు. అమెరికాలో 1,05, 019 కరోనా పాజిటీవ్ కేసులు నమోదు కాగా, 1,717 మంది మృతిచెందారు. జర్మనీలో 53,340 కరోనా పాజిటివ్ కేసులు, 399 మంది మృతిచెందారు.
ప్రపంచవ్యాప్తంగా 595వేల మందికి పైగా వ్యాధి సోకింది. ప్రపంచవ్యాప్తంగా 595,000 మందికి పైగా ఈ వైరస్ బారిన పడ్డారు. సుమారు 27వేల మంది మరణించారు. ఇప్పటివరకూ అమెరికా సహా ఐదు దేశాలు సుమారు 1,700 మరణాలను అధిగమించాయి.
ఇటలీ, స్పెయిన్, చైనా, ఇరాన్, ఫ్రాన్స్, ఐరోపాలో, ఇటలీ మరణాలలో 24 గంటల భారీ పెరుగుదలను నమోదు చేసింది. 969 మంది బాధితులు, మొత్తం మరణాల సంఖ్య 9,134కు చేరింది. యుఎస్ కరోనావైరస్ వెనుక, ప్రపంచంలో రెండవ అత్యధిక కేసులు నమోదయ్యాయి. చైనాను అధిగమించి, దేశంలో ఇప్పుడు 86,000 కేసులు నమోదు అయ్యాయి.