Health Benefits Of Crab : రక్త హీనతను నివారించి, గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరిచే పీత

పీతలో ఉండే పోషకాలు సాధారణ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. పీతలోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యానికి సంబంధించిన అనేక ప్రయోజనాలను అందిస్తాయి.  ఈ ముఖ్యమైన పోషకాలు ట్రైగ్లిజరైడ్‌లను తగ్గించడంలో సహాయపడతాయి.

Crab

Health Benefits Of Crab : పీతలను ఆహారంగా తీసుకునేందుకు చాలా మంది ఇష్టపడరు. అయితే సముద్రతీర ప్రాంతపరిధిలోని వారు చేపలతోపాటు పీతల కూర రుచి చూడనిది ఉండలేరు. తీర ప్రాంత ప్రజలు ఆస్వాదించే తొలి ఆహారాలలో పీత ఒకటి. అత్యంత ప్రజాదరణ పొందిన ఆహారాలలో పీత కూడా ఒకటి అని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. చైనా ప్రపంచంలోనే అతిపెద్ద పీతల ఎగుమతిదారుగా ఉండగా యునైటెడ్ స్టేట్స్ అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్న జాబితాలో ఉంది.

పీత మాంసం ఇతర సీఫుడ్‌ల మాదిరిగానే అనేక పోషకాలను కలిగి ఉంటుంది. విటమిన్ B12, ఫోలేట్ ,ఇనుము, నియాసిన్, సెలీనియం, జింక్పీతలో వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. పీత ప్రోటీన్‌ తో నిండి ఉంటుంది. ఇది కండరాల నిర్మాణానికి మరియు నిర్వహించడానికి కీలకంగా తోడ్పడుతుంది.

పీతలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్ B12 మరియు సెలీనియం కూడా అధిక స్థాయిలో ఉంటాయి. ఈ పోషకాలు సాధారణ ఆరోగ్యాన్ని మెరుగుపరచటంలో కీలకపాత్ర పోషిస్తాయి. వివిధ రకాల దీర్ఘకాలిక పరిస్ధితులను నివారించటంలో సహాయపడతాయి. పీతలలో ట్యూనా చేపల కంటే తక్కువ స్థాయి పాదరసం ఉంటుంది.

పీతలో ఉండే పోషకాలు సాధారణ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. పీతలోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యానికి సంబంధించిన అనేక ప్రయోజనాలను అందిస్తాయి.  ఈ ముఖ్యమైన పోషకాలు ట్రైగ్లిజరైడ్‌లను తగ్గించడంలో సహాయపడతాయి. రక్తం గడ్డకట్టడాన్ని తగ్గిస్తుంది. క్రమరహిత హృదయ స్పందన లేకుండా తోడ్పడుతుంది.

వారానికి ఒకసారైనా పీత వంటి సీఫుడ్ తినే వ్యక్తులలో చిత్త వైకల్యం, అల్జీమర్స్ వ్యాధి ప్రమాదాన్ని తగ్గించవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఈ  సీఫుడ్ ఉత్పత్తులలో కనిపించే అధిక స్థాయి ఒమేగా-3 కొవ్వు ఆమ్లాల నుండి ఉత్పన్నమవుతుంది. విటమిన్ B12 మరియు ఫోలేట్‌తో సహా పీతలో ఉండే అనేక పోషకాలు విటమిన్ లోపం అనీమియా ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

అదే సమయంలో బ్రౌన్ పీత మాంసంలో అధిక మోతాదులో కాడ్మియం కలిగి ఉంటాయి. వీటిని అధికంగా తీసుకుంటే విషపూరితంగా మారే అవకాశాలు ఉంటాయి. పీతలో సోడియం కూడా ఉంటుంది. 85 గ్రాముల పీతల మాంసంలో 237 మిల్లీ గ్రాముల సోడియం ఉంటుంది.