CRP Blood Test: ఇక హార్ట్ ఎటాక్ మరణాలు తగ్గుతాయి.. గుండెపోటును ముందే తెలుసుకునే రక్త పరీక్ష.. CRP టెస్ట్ తో ప్రాణాలు సేఫ్

CRP Blood Test: CRP అంటే C-రెయాక్టీవ్ ప్రోటీన్. ఇది శరీరంలో ఉండే వేడి వల్ల కాలేయం నుండి ఉత్పత్తి అవుతుంది.

With CRP Blood test We can detect heart attack even before

ఈ మధ్య కాలంలో గుండెపోటుతో చనిపోతున్న వారి సంఖ్య చాలా పెరుగుతోంది. అందులోని యువతలో ఈ మరణాలు ఎక్కువ అవడం ఆందోళనను కలిగిస్తోంది. దీనికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. మారుతున్న జీవన విధానం, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి ఇలా చాలా రకాల కారణాల వల్ల గుండెపోటు సంభవిస్తోంది. అయితే, మిగతా ఆరోగ్య సమస్యలలాగా గుండెపోటు రావడాన్ని ముందే తెలుసుకునే టెస్ట్ లు లేకపోవడం వల్ల మరణాల శాతం ఎక్కువగా ఉంది. కానీ, తాజాగా పరిశోధనల్లో గుండెపోటును ముందే తెలుసుకునే రక్త పరీక్షను కనుగొన్నారు నిపుణులు.

ప్రముఖ గుండె నిపుణులు డాక్టర్ డిమిత్రి యారనోవ్ ఈ విషయం గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. జూన్ 16న ఆయన ఈ విషయం గురించి తన ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టారు. గుండెపోటును ముందే కనుగొనే రక్త పరీక్షను తెలుసుకున్నాం అదే CRP. ఇది మీ ప్రాణాలు కాపాడే రక్త పరీక్ష. కానీ, ఇది మీకు ముందే తెలిసిన కొలెస్ట్రాల్ టెస్ట్ మాత్రం కాదు. ఇది మీ ధమనులపై తీవ్ర ప్రభావం చూపించే వాపు గురించి తెలియజేస్తుంది. నిజానికి చాలా మందికి తమ CRP గురించి తెలియదు. కొంతమంది అనుకుంటారు రక్తంలో కొలెస్ట్రాల్ తక్కువగా ఉంది కాబట్టి మాకు హార్ట్ ఎటాక్ రాదు అని. కానీ, కొలెస్ట్రాల్ తక్కువగా ఉంది CRP ఎక్కువగా ఉన్నా గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని ఆయన చెప్తున్నారు.

అసలు CRP అంటే ఏంటి?

CRP అంటే C-రెయాక్టీవ్ ప్రోటీన్. ఇది శరీరంలో ఉండే వేడి వల్ల కాలేయం నుండి ఉత్పత్తి అవుతుంది. రక్తంలో ఇది ఎక్కువైతే రక్తనాళాలు దెబ్బతింటాయి. దానివల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి, CRP శాతాన్ని తెలుసుకోవడం వల్ల ముందే గుండె సమస్యలను తెలుసుకోవచ్చు.

CRP ఎక్కువగా ఉండే ఏమవుతుంది?

  • హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం
  • స్ట్రోక్ వచ్చే ప్రమాదం
  • రక్తనాళాలు మూసుకుపోయే ప్రమాదం ఉంది
  • పరిధీయ ధమని వ్యాధి

రక్తంలో CRP స్థాయిని ఎలా కొలుస్తారు:

  • రక్తలో CRP స్థాయిలు ఎంత తక్కువగా ఉంటె అంత మంచిది
  • >3.0 mg/L= చాలా ప్రమాదం
  • 1.0-3.0 ఎక్కువగా ఉంది
  • < 1 = తక్కువ

CRP లెవల్స్ ను ఎలా తగ్గించుకోవచ్చు:

  • గుండెకు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి
  • శారీరక శ్రమ అవసరం
  • బరువు అదుపులో ఉంచుకోవాలి
  • ధూమపానం, మధ్యపాణం మానేయాలి