Diabetes: వడగాలుల పట్ల జాగ్రత్తగా ఉండాలి.. మరీ ముఖ్యంగా మధుమేహులు.. ఏం చేయాలంటే

సీజన్‌లో వేడిగా ఉండే సమయంలో, మధుమేహం ఉన్న వ్యక్తులు రక్తంలో చక్కెర స్థాయిలను క్రమం తప్ప కుండా తనిఖీ చేయడం, ఆ రోజుల్లో అధిక భాగానికి వాటిని నిర్దేశిత లక్ష్య పరిధిలో (సాధారణంగా 70 - 180 mg/dl) ఉంచడానికి ప్రయత్నించడం చాలా ముఖ్యం.

Health Care: ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్నందున, వడగాలులు చాలా తరచుగా, తీవ్రంగా మారాయి. ఇది ప్రపంచ వ్యాప్తంగా ప్రజలకు గణనీయమైన సవాళ్లను కలిగిస్తుంది. భారత వాతావరణ విభాగం (IMD) వడగాలుల హెచ్చరికలు జారీ చేయడమనేది మధుమేహంతో జీవించే వ్యక్తులకు ప్రత్యేకమైన ప్రమాదాలకు సంబం ధించిన పరీక్ష పెడుతుంది. మధుమేహాన్ని నిర్వహించుకోవడం అనేది ఇప్పటికే ఒక సున్నితమైన సమతుల్య సాధన చర్య. కానీ తీవ్రమైన వేడితో కలిపి ఉన్నప్పుడు, ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సానుకూల చర్యలు తీసుకోవడం మరింత కీలకం అవుతుంది.

Tips to keep bananas fresh : అరటిపండు త్వరగా రంగు మారకుండా ఉండాలంటే ఇలా చేయండి

మధుమేహం ఉన్నవారు మారుతున్న ధోరణులు, వాతావరణ ప్రభావాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. మీ గ్లూ కోజ్ స్థాయిలపై ఓ కన్నేసి ఉంచడం ఎంతో ప్రధానాంశం. మధుమేహం ఉన్నవారికి, రక్తంలో చక్కెర స్థాయిలను పర్యవేక్షించడం చాలా ముఖ్యం, ప్రత్యేకించి ఈ స్థాయిలు హెచ్చుతగ్గులకు కారణమయ్యే ఏవైనా జీవనశైలి మార్పుల విషయంలో. ఫ్రీస్టైల్ లిబ్రే వంటి సీజీఎం పరికరాలతో ఈ ప్రక్రియ సులభతరం అయింది. ఇది ప్రయాణంలో కూడా మీ పరిస్థితిని తనిఖీ చేయడంలో మీకు సహాయం చేయడానికి ఒక తిరుగులేని, నొప్పిలేని పరిష్కారాన్ని అందిస్తుంది. మీరు మీ రీడింగ్‌లను గమనిస్తూ ఉండాలి. ప్రతి రోజు 24 గంటలలో 17 గంటల పాటు సరైన గ్లూకోజ్ శ్రేణిలో ఉండటానికి ప్రయత్నించాలి.

Milap: క్యాన్సర్ పై పోరాడి విజయం సాధించిన వారికి మద్దతుగా హైదరాబాద్‌లో ‘హెయిర్ డొనేషన్ డ్రైవ్’ నిర్వహించిన మిలాప్

సీజన్‌లో వేడిగా ఉండే సమయంలో, మధుమేహం ఉన్న వ్యక్తులు రక్తంలో చక్కెర స్థాయిలను క్రమం తప్ప కుండా తనిఖీ చేయడం, ఆ రోజుల్లో అధిక భాగానికి వాటిని నిర్దేశిత లక్ష్య పరిధిలో (సాధారణంగా 70 – 180 mg/dl) ఉంచడానికి ప్రయత్నించడం చాలా ముఖ్యం. సీజీఎం వంటి కొన్ని రకాల సాధనాలను ఉపయోగించి ఇది సులభంగా చేయవచ్చు. దీని కోసం, మీ గ్లూకోజ్ స్థాయిలపై మీకు సమాచారం అందించడానికి వేలుకు సూది గుచ్చాల్సిన అవసరం కూడా ఉండదు. అటువంటి పరికరాలు టైమ్ ఇన్ రేంజ్ వంటి కొలమానాలను కలిగి ఉంటాయి – మీ రీడింగ్‌లను తరచుగా తనిఖీ చేయడం అనేది సాధారణంగా చాలా సందర్భాల్లో మీ సరైన పరిధిలో మీరు ఎక్కువ సమయం వెచ్చించడంతో అనుబంధించబడుతుంది. ఇది మీ గ్లూకోజ్ నియంత్రణను మెరుగు పరుస్తుంది.