Tips to keep bananas fresh : అరటిపండు త్వరగా రంగు మారకుండా ఉండాలంటే ఇలా చేయండి

అరటిపండు అందరూ విరివిగా కొనుగోలు చేస్తారు. చాలామంది ఇష్టపడి తింటారు. అయితే అతిగా పక్వానికి వచ్చినా.. రంగుమారినా ఇష్టపడరు. అలా కాకుండా అరటిపండ్లు ఎక్కువరోజులు నిల్వ ఉండాలంటే కొన్ని టిప్స్ పాటించాలి.

Tips to keep bananas fresh : అరటిపండు త్వరగా రంగు మారకుండా ఉండాలంటే ఇలా చేయండి

Tips to keep bananas fresh

Tips to keep bananas fresh : అరటిపండు తినడానికి చాలామంది ఇష్టపడతారు. అయితే వీటిని కొని నిల్వ ఉంచేటపుడు తగిన జాగ్రత్తలు పాటించకపోతే త్వరగా గోధుమరంగులోకి మారిపోతాయి. అలా కాకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.

Banana Cultivation : వేసవిలో అరటి తోటల సంరక్షణ

చాలామంది విరివిగా కొనే పండ్లలో అరటిపండు ఒకటి. చాలామంది తినడానికి ఇష్టపడతారు. అయితే రంగు మారిన, మరీ మెత్తగా అయిన పండ్లను తినడానికి కొందరు ఇష్టపడరు. అయితే అలా కాకుండా వాటిని నిల్వ ఉంచే క్రమంలో కొన్ని టిప్స్ పాటిస్తే ఎక్కువరోజులు ఫ్రెష్ గా ఉంటాయి. చాలామంది డజన్ల కొద్దీ ఒకేసారి అరటిపండ్లు కొనుగోలు చేస్తారు. అలా కాకుండా అవసరాన్ని బట్టి వీటిని కొనాలి. అలాగే తినేటపుడు అవి తీయగా.. రంగు మారకుండా ఉండాలి అంటే ఆకుపచ్చని రంగులో ఉండే అరటిపండ్లను సెలక్ట్ చేసుకోవాలి. లేదా కొద్దిరోజులు నిల్వ ఉంచుకుని తినాలి అనుకుంటే కొద్దిగా పచ్చిగా ఉన్న అరటిపండ్లను కొనాలి.

 

అరటిపండ్లను మనం తినే ఇతర ఆహార పదార్ధాలకు దూరంగా ఉంచాలి. అలాగే ఇతర పండ్లకు కూడా దూరంగా పెట్టాలి. అలా ఉంచకపోతే త్వరగా పక్వానికి వస్తాయి. మూసి ఉన్న కంటైనర్ లేదా ఫ్రీజర్ బ్యాగ్‌లో ఉంచడం బెటర్. అరటిపండ్లను గెలగా కాకుండా వాటిని గెల నుంచి వేరు చేయడం ద్వారా కూడా త్వరగా పక్వానికి రాకుండా చేయవచ్చు. గెలలో ఒకపండు త్వరగా పక్వానికి వస్తే ఇతర పండ్లు కూడా త్వరగా పక్వానికి వచ్చే అవకాశం ఉన్నందున వాటిని విడివిడిగా ఉంచడం మంచిది.

Banana Crop Cultivation : ప్రయోగాత్మకంగా అరటి సాగు.. లాభాలు అధికం అంటున్న రైతు

అరటిపండ్లు ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే వాటి చివర్లు ప్లాస్టిక్ లేదా ర్యాప్ లేదా అల్యూమినియం ఫాయిల్‌తో చుట్టడం మంచిది. ఇలా చేయడం వల్ల ఎక్కువరోజులు నిల్వ ఉండటంతో పాటు తాజాగా ఉంటాయి. ఇక అరటిపండు గోధుమ రంగులోకి మారుతున్నట్లుగా అనిపిస్తుంటే చల్లని ప్రదేశంలో ఉంచడం ద్వారా వాటిని మరికొన్ని రోజులు నిల్వ ఉంచవచ్చు. పైన తొక్క రంగు మారినా లోపల పండు ఖచ్చితంగా తినేలా ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న చిట్కాల ద్వారా అరటిపండ్లు త్వరగా రంగుమారకుండా ఫ్రెష్‌గా ఉండేలా చూసుకోవచ్చు.