Women’s Health: మహిళల్లో డెలివరీ తరువాత కంటిచూపుపై ప్రభావం.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Women's Health: అవును జరుగుతుంది. అయితే ఇది అన్ని సందర్భాల్లో కచ్చితంగా జరుగుతుంది అని మాత్రం చెప్పలేం. కొంతమంది మహిళల్లో మాత్రమే ఈ సమస్య రావడానికి అవకాశం ఉంది.

Do women experience vision problems after delivery?

సంతానం కలగడం అనేది మహిళ జీవితంలో ఒక ముఖ్యమైన దశ. కానీ గర్భధారణ సమయంలో, డెలివరీ తరువాత మహిళల్లో కొన్ని శారీరక, హార్మోనల్ మార్పులు అనివార్యంగా జరుగుతాయి. చాలా మంది మహిళలు డెలివరీ తర్వాత కంటిచూపులో తక్కువదనం, కళ్ళలో తడి లేకపోవడం, మసకబారిన చూపు వంటి సమస్యలను ఎదుర్కొంటు ఉంటారు. ఇవి కొన్ని సందర్భాలలో తాత్కాలిక సమస్యలుగా అనిపించినా, కొన్ని సందర్భాల్లో మాత్రం తీవంగా మారవచ్చు. మరి డెలివరీ తరువాత ఇలా కంటి సమస్యలు రావడానికి కారణం ఏంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

డెలివరీ తర్వాత కంటిచూపు తగ్గే అవకాశం ఉందా?

అవును జరుగుతుంది. అయితే ఇది అన్ని సందర్భాల్లో కచ్చితంగా జరుగుతుంది అని మాత్రం చెప్పలేం. కొంతమంది మహిళల్లో మాత్రమే ఈ సమస్య రావడానికి అవకాశం ఉంది. శరీరంలో జరిగే హార్మోనల్ మార్పులు, పోషకాహార లోపాలు, రక్తపోటు మార్పులు ఇలా ఎన్నో కారణాలు దీని వెనుక ఉన్నాయి.
కారణాలు (Causes):**

1.హార్మోనల్ మార్పులు:
గర్భధారణ సమయంలో, డెలివరీ తరువాత మహిళల్లో సాధారణంగా ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ లాంటి హార్మోన్ల స్థాయిలు మారతాయి. ఇది కంటి శ్లేష్మపటలం ను ప్రభావితం చేస్తుంది. ఆ కారణంగా కళ్ళు పొడిబారడం, తడి తగ్గిపోవడం, చూపు తక్కువగా అనిపించడం జరుగుతుంది.

2.అనిమియా / ఐరన్ లోపం:
రక్తహీనత (anemia) అనేది డెలివరీ తర్వాత ప్రతీ మహిళాలో సర్వసాధారణం. ఆ కారణంగా మెదడు, కళ్లకు సరిపడిన రక్తప్రవాహం లేకపోవడం వల్ల మసక చూపు,

3.బ్లడ్ ప్రెజర్ మార్పులు:
హై బీపీ గల మహిళల్లో ప్రసవ సమయంలో రక్తనాళాలపై ఒత్తిడి పెరగడం వల్ల కంటి రెటినా ప్రభావితం అవుతుంది. ఇది ఆయపతీ (Preeclampsia), హైపర్టెన్సివ్ రెటినోపతి వంటి వాటికి దారితీస్తుంది.

4.జీర్ణక్రియలో మార్పులు, నీటిలోపం:
శరీరానికి సరిపడా నీరు తీసుకోకపోవడం వల్ల కళ్ళు డ్రైగా మారతాయి. తల్లులు తిండిలో తక్కువ పోషకాలు తీసుకుంటే విటమిన్ A, B12 లోపాలు చూపును ప్రభావితం చేస్తాయి.

5.మైగ్రేన్/ హెడ్‌ఎక్స్:
డెలివరీ తర్వాత కొంతమంది స్త్రీలు తలనొప్పుల (మైగ్రేన్) బాధతో బాధపడతారు. మైగ్రేన్ వల్ల కూడా కంటిలో వెలుతురు ఛాయలుగా, తేలికపాటి మసక చూపుగా ఉండొచ్చు.

నివారణ చర్యలు:

1.సరైన పోషకాహారం: విటమిన్ A, C, E, B12, జింక్ కలిగిన ఆహారాలు తీసుకోవాలి. గాజరులు, బీట్‌రూట్, ఆకుకూరలు, బాదం, జామపండ్లు, పప్పులు వంటి ఆహారం శరీర పునరుద్ధరణకు అవసరం.

2.తగిన తీరు తాగాలి: రోజుకి కనీసం 2.5 లీటర్ల నీరు తాగాలి. డీహైడ్రేషన్ వల్ల కూడా కంటి చూపు మందగిస్తుంది.

3.రెగ్యులర్ కంటి పరీక్షలు: డెలివరీ తరువాత కనీసం 3 నెలల్లో ఒకసారి కంటి పరీక్ష చేయించుకోవాలి. డయబెటిస్ గర్భధారణ ఉన్నవారైతే తప్పకుండా కంటి వైద్యుడిని సంప్రదించాలి.

డెలివరీ తరువాత కంటిచూపులో మార్పు రావడం చాలా సందర్భాల్లో తాత్కాలికమైనదే. సరైన ఆహారం, విశ్రాంతి, తగిన మోతాదులో నీరు తీసుకోవడం వల్ల నయం అవుతుంది. అయినప్పటికీ , దీనిని నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు.