Eat these 5 types of dosas for a healthy breakfast
Healthy breakfast: ప్రతీరోజును మంచి ఆహారంతో ప్రారంభిస్తే, ఆ రోజంతా శక్తివంతంగా ఉండే అవకాశం ఉంది. అందుకే బ్రేక్ ఫాస్ట్ లేదా ఉదయం టిఫిన్ మన ఆరోగ్యంపై చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. ఇక చాలా మంది సాధారణంగా ఉందయం ఇడ్లీ, పూరి, వడ, దోశ తీసుకుంటారు. అందులోను దోశ చాలా స్పెషల్. చాలా మంది ఇష్టంగా తింటారు. అయితే, దోశల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఇవి కేవలం రుచిని మాత్రమే కాదు.. ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి. మరి ఆరోగ్యాన్ని అందించే 5 రకాల దోశల(Healthy breakfast) గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
Kidney Health: ఈ కూరగాయలు చేసే మాయ.. కిడ్నీలు మొత్తం క్లీన్.. మీరు కూడా ట్రై చేయండి
1.రాగి దోస:
ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. ఇందులో కాల్షియం అధికంగా ఉంటుంది కాబట్టి ఎముకలకు బలాన్ని ఇస్తుంది. అధిక ఫైబర్ కూడా ఉండడంతో జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది. రాగి పిండి, ఉలువలు, కొంచెం బియ్యం కలిపి పేస్ట్ చేసి, పులిపిన తర్వాత దోశలా వేసుకోవాలి.
2.పోహ దోస:
పోహ దోస తేలికగా జీర్ణమవుతుంది. కాబట్టి జీర్ణవ్యవస్థపై తక్కువ ప్రభావం పడుతుంది. తక్కువ కాలొరీస్‌తో అధిక శక్తిని అందిస్తుంది. పోహ, బియ్యం, పెరుగు కలిపి మిక్సీలో గ్రైండ్ చేసి తక్షణమే దోసలాగా వేసుకోవచ్చు.
3.మొలకెత్తిన పెసర దోస (పెసరట్టు):
పెసర దోస ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. అలాగే కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. తక్షణ శక్తినిచ్చే ఆహారంగా దీనిని తీసుకోవచ్చు. పెసరపప్పును నానబెట్టి మొలకెత్తిన తర్వాత గ్రైండ్ చేసి దోసలా వేయాలి. ఇందులో ఉల్లిపాయలు, అల్లం కూడా కలిపితే రుచి మరింత పెరుగుతుంది.
4.క్వినోవా దోస:
హై ప్రోటీన్, హై ఫైబర్ డైట్ కావాలనుకునేవారికి క్వినోవా దోస ఉత్తమం అనే చెప్పాలి. ఇది గ్లూటెన్ ఫ్రీ, డయాబెటిక్ ఫ్రెండ్లీ దోశ. షుగర్ పేషేంట్స్ ఈ దోశ తినడం వల్ల షుగర్ మొత్తం కంట్రోల్ లో ఉటుంది. శరీరానికి అవసరమైన అతి ముఖ్యమైన అమైనో యాసిడ్లు ఈ దోశ అందిస్తుంది. క్వినోవా, ఉలువలు, కొంచెం బియ్యం కలిపి నానబెట్టి, గ్రైండ్ చేసి, పులియన తర్వాత దోసలుగా వేసుకోవచ్చు.
5.క్యారెట్, బీట్‌రూట్ దోస:
విటమిన్ A, విటమిన్ C అధికంగా ఉండే ఈ కూరగాయలు రోగనిరోధక శక్తిని చాలా పెంచుతాయి. ఇది చర్మ ఆరోగ్యానికి కూడా ఉపయోగపడతాయి. ఈ రెండిటిలో ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి కాబట్టి మంచి ఆరోగ్యం లభిస్తుంది. బేసిక్ దోస పిండిలో క్యారెట్, బీట్‌రూట్ తురిమి కలిపి దోశలు చేసుకోవాలి.
ఈ ఆరోగ్యకరమైన దోశలు రోజువారీ బ్రేక్ ఫాస్ట్‌కి చక్కని ప్రత్యామ్నాయాలు అని చెప్పుకోవచ్చు. వీటిలో పోషకాలు ఉండటంతో పాటు, రుచి పరంగా కూడా అద్భుతంగా ఉంటాయి.