suicide prevention : మాటలో తేడా.. ప్రవర్తనలో మార్పు.. అలాంటి వారిని గుర్తించడం ఎలా?

మనకి బాగా తెలుసుకున్నవారు.. పైకి చాలా సంతోషంగా కనిపించిన వారు సడెన్ గా ఆత్మహత్యకు పాల్పడ్డారు.. అనే వార్తలు చాలా వింటున్నాం. అంటే వారు అంత బలహీనులా? అన్ని విషయాలు నిర్భయంగా చెప్పేవారు ఆత్మహత్యకు ఎందుకు పాల్పడ్డారు? ఆ ఆలోచనలు ఇంట్లోవారితో ఎందుకు షేర్ చేసుకోలేకపోయారు? వీటన్నిటికీ మానసిక నిపుణులు చెప్పే సమాధానం ఏంటి?

suicide prevention :  జీవితం బోర్ కొడుతోందని.. అనుకున్నది సాధించలేకపోయానని.. బ్రతికి ఉండి వేస్ట్ అని కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. చీకట్లో పిల్లిని చూసి భయపడేవారు కూడా బలవంతంగా చనిపోవడానికి భయపడరు. అసలు ఆత్మహత్య ఆలోచన వాళ్లలో ఎందుకు పుడుతుంది? దానికి పురిగొల్పే అంశాలు ఏంటి? ఆ సమయంలో వారికి ఎలాంటి ఆసరా కావాలి?

Jiah Khan : బాలీవుడ్ హీరోయిన్ ఆత్మహత్య కేసులో పదేళ్ల తర్వాత తీర్పు.. నిర్దోషిగా విడుదలైన నిందితుడు..

ప్రతి వ్యక్తికి జీవితం పట్ల కొన్ని లక్ష్యాలు ఉంటాయి. దాని దిశగా అడుగులు వేస్తుంటారు. ఈ క్రమంలో గెలుపోటములు సహజం.. సున్నితమైన అంశాల్లో కొందరు స్ట్రాంగ్ గా ఉండగలిగితే.. కొందరు పిరికితనంతో వెనకడుగు వేస్తారు. అక్కడితో జీవితం అయిపోయినట్లు భావిస్తారు. భవిష్యత్ కనిపించట్లేదని భయపడిపోతారు. ఇంట-బయట అవమానం జరిగినట్లు ఫీలవుతారు. మానసికంగా బలహీనమైపోతారు. అలా తీవ్రమైన ఒత్తిడికి లోనై జీవితమే వ్యర్ధమనే తీవ్ర మానసిక స్థితిలోకి వెళ్లిపోతారు.

ఆత్మహత్య గురించి ఆలోచించేవారిలో ప్రధానంగా కనిపించే అంశాలు
* మాటలో తేడా
* ప్రవర్తనలో మార్పు
* విచారంగా ఉండటం
* తీవ్రంగా ఉద్రేక పడటం
* మూడ్ స్వింగ్స్

తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నవారు కుటుంబ సభ్యులను దూరం పెడతారు. మద్యం లేదా మాదక ద్రవ్యాలకు బానిస అవుతారు. అతిగా నిద్రపోవడం.. ఎక్కువగా లేదా తక్కువగా ఆహారం తీసుకోవడం చేస్తారు. చనిపోవడానికి ఎలాంటి మార్గాలు ఎంచుకోవాలా? అనే ఆలోచనలతో గడుపుతారు. కొందరిలో అంతుచిక్కని వ్యాధులు, మానసిక అనారోగ్య పరిస్థితులు ఆత్మహత్యకు పురిగొల్పే అంశాలుగా ఉంటాయి. ఇక లైంగిక వేధింపులు భరించలేక కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు.

Jiah Khan : బాలీవుడ్ హీరోయిన్ ఆత్మహత్య కేసులో పదేళ్ల తర్వాత తీర్పు.. నిర్దోషిగా విడుదలైన నిందితుడు..

ఆత్మహత్య ఆలోచనల నుంచి వారిని ఎలా బయటకు తీసుకురావాలి?
*వారితో ప్రశాంతంగా మాట్లాడాలి
*వారు చెప్పేది సీరియస్ గా తీసుకోవాలి
*వారికి జీవితం పట్ల ఆసక్తి పెంచడంతో పాటు.. భరోసా ఇవ్వాలి
*కొంతకాలంపాటు వారిని ఓ కంట కనిపెట్టాలి

ఇక పరిస్థితి చేయిదాటిపోయే పరస్థితులకు చేరుకుంటే సైకోథెరపీ, టాక్ థెరపీ లాంటివి అందుబాటులో ఉన్నాయి. ఈ చికిత్సల ద్వారా వారి ఆలోచన విధానంలో మార్పు వచ్చి ఒత్తిడి నుంచి బయటకు రాగలుగుతారు. ఈ చికిత్స తీసుకునే సమయంలో కుటుంబసభ్యులు, స్నేహితులు కూడా వారికి సపోర్ట్ గా నిలబడాలి.

Delhi: తన మీద తప్పుడు కేసు పెట్టారని పోలీస్ స్టేషన్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు

ఒత్తిడిని జయించాలంటే కొత్త ఆలోచనలకు స్వాగతం చెప్పాలి. ఇష్టమైన మొక్కలు, జంతువులు పెంచుకోవడం ద్వారా.. పుస్తకాలు చదవడం ద్వారా ఖచ్చితమైన మార్పు వస్తుంది. ఇక చాలామంది మానసిక నిపుణులు చెప్పేది ఒకటే మాట ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు ఉన్న వ్యక్తులు దానిని ధైర్యంగా చెప్పగలగాలి. ఎంత త్వరగా ప్రివెంట్ చేయగలిగితే అంత త్వరగా వారిని కాపాడగలుగుతామని చెబుతున్నారు.

దీనిని బట్టి ఎవరైతే ఒత్తిడికి లోనవుతున్నారో.. ఏ కారణాలైతే ఆత్మహత్యకు పురిగొల్పుతున్నాయో వాటిని కుటుంబసభ్యులతో పంచుకోవాలి. సరైన సమయంలో ట్రీట్మెంట్ తీసుకున్నవారు ఒత్తిడిని జయించి కొత్త జీవితాన్ని మొదలుపెట్టగలుగుతారు.

ట్రెండింగ్ వార్తలు