Maharashtra: హెయిర్ కటింగ్ నచ్చలేదని 16వ అంతస్థు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న బాలుడు
అపార్ట్‌మెంట్ బిల్డింగ్ 16వ అంతస్తులోని బాత్‌రూమ్ కిటికీ నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. తీవ్రంగా గాయపడిన ఆ బాలుడు అక్కడికక్కడే మరణించాడు. సమాచారం అందుకున్న నవఘర్ పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు.

Crime
Maharashtra: హెయిర్ కట్ చిన్నగా ఉందని తీవ్ర అసంతృప్తికి లోనైన ఒక బాలుడు 16వ అంతస్థులో ఉన్న బాత్‌రూమ్ నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మహారాష్ట్రలోని థానే జిల్లా భయందర్‌లో జరిగిందీ దారుణం. 13 ఏళ్ల బాలుడికి కుటుంబ సభ్యులు హెయిర్ కట్ చేయించారు. అయితే జుట్టు చాలా చిన్నగా కత్తిరించడంపై అతడు తీవ్ర అసహనానికి గురయ్యాడు. తన స్నేహితుల ముందు తిరగలేనని చెప్పినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Bandi Sanjay Wife: బండి సంజయ్ అక్రమ కేసులకు భయపడే వ్యక్తి కాదు.. బండి సతీమణి అపర్ణ
అంతే.. అపార్ట్‌మెంట్ బిల్డింగ్ 16వ అంతస్తులోని బాత్‌రూమ్ కిటికీ నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. తీవ్రంగా గాయపడిన ఆ బాలుడు అక్కడికక్కడే మరణించాడు. సమాచారం అందుకున్న నవఘర్ పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. బాలుడి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు.
CRPF Recruitment : సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ లో భారీగా కానిస్టేబుల్ పోస్టుల భర్తీ