Bandi Sanjay Wife: బండి సంజయ్ అక్రమ కేసులకు భయపడే వ్యక్తి కాదు.. బండి సతీమణి అపర్ణ

బండి సంజయ్ అక్రమ కేసులకు భయపడే వ్యక్తి కాదని, అక్రమ అరెస్ట్ విషయంలో ఖండించిన ప్రతి కార్యకర్తకు పేరుపేరున ధన్యవాదాలు తెలపమని చెప్పారని బండి సంజయ్ సతీమణి అపర్ణ తెలిపారు.

Bandi Sanjay Wife: బండి సంజయ్ అక్రమ కేసులకు భయపడే వ్యక్తి కాదు.. బండి సతీమణి అపర్ణ

Bandi Sanjay wife Aparna

Bandi Sanjay Wife: పేపర్ లీక్ కేసులో అరెస్టయ్యి కరీంనగర్ జైలులో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను ఆయన సతీమణి అపర్ణ కుమారుడు, బావ మరిది కలిశారు. గురువారం ఉదయం ములాఖత్ కింద భార్య అపర్ణ దరఖాస్తు చేసుకోగా అనుమతి ఇవ్వడంతో గురువారం 11 గంటల సమయంలో సంజయ్ ను కలిసేందుకు వారు జైలుకు వెళ్లారు. జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత సంజయ్ సతీమణి అపర్ణ మాట్లాడారు. బండి సంజయ్ అక్రమ కేసులకు భయపడే వ్యక్తి కాదన్నారు. బండి సంజయ్ అక్రమ అరెస్ట్ విషయంలో ఖండించిన ప్రతి కార్యకర్తకు పేరు పేరున ధన్యవాదాలు తెలపమని చెప్పారని తెలిపారు.

Bandi Sanjay Arrest: బండి సంజయ్‪కు 2 వారాల రిమాండ్.. జైలుకి తరలింపు

మా తల్లిగారి దశదిన కర్మ సమయంలో ఇలా అరెస్ట్ చేయడం బాధాకరంగా ఉందని, ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు నాకు భయం లేదని, కానీ పిల్లలు కొంచెం ఎమోషనల్ అయ్యారన్నారు. తెలంగాణలో జరిగే మోడీ సభను విజయవంతం చేయాలని బండి పిలుపునిచ్చారని, ఏ కార్యకర్తకు కష్టం వచ్చినా బీజేపీ అండగా ఉంటుందని చెప్పమని బండి సంజయ్ చెప్పారని అపర్ణ పేర్కొన్నారు.

Bandi sanjay : కారణం లేకుండా బండి సంజయ్ ను ఎలా అరెస్ట్ చేస్తారు

ఇదిలాఉంటే కరీంనగర్ జైలులో ఉన్న బండి సంజయ్‌కి సాధారణ ఖైదీలకు ఇచ్చే భోజనం ఇచ్చారు. ఉదయం పూట ఇండ్లీ. మధ్యాహ్నం అన్నంతో పాటు పప్పు టమోటా, రసం ఇచ్చారు. ఎలాంటి టెస్ట్ లేకుండానే ఆహారం ఇచ్చారు. ఈక్రమంలో నిన్న ఆహారం విషయంలో బండి సంజయ్ న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే, కోర్టు నుంచి ఎలాంటి ఆదేశాలు లేకపోవటంతో సాధారణ భోజనం అందించామని జైలు అధికారులుతెలిపారు.