Bone Soup Benefits: సూపర్ ఎనర్జీ సూప్.. రోగనిరోధక శక్తి డబుల్ అవుతుంది.. ఎముకలు గట్టిగా అవుతాయి

Bone Soup Benefits: సూపర్ పవర్ ఎనర్జీ డ్రింక్ లలో బోన్ సూప్ (ఎముకల సూప్) ఒకటి. ఇది మన ప్రాచీన కాలం నుండి పూర్వీకులు ఉపయోగిస్తున్న ఆరోగ్య మంత్రాలలో ఒకటి.

Health benefits of drinking a bowl of soup a day

ప్రస్తుతం మార్కెట్ లో చాలా రకాల ఎనర్జీ డ్రింక్ లు అందుబాటులో ఉన్నాయి. కానీ, వాటిని కెమికల్స్ తో తాయారు చేస్తారు. వారిని తరుచుగా తాగడం వల్ల అనేకరకాల ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి, సహజంగా లభించే ఎనర్జీ డ్రింక్ లను తీసుకోవడం మంచిది. అలాంటి సూపర్ పవర్ ఎనర్జీ డ్రింక్ లలో బోన్ సూప్ (ఎముకల సూప్) ఒకటి. ఇది మన ప్రాచీన కాలం నుండి పూర్వీకులు ఉపయోగిస్తున్న ఆరోగ్య మంత్రాలలో ఒకటి. సాధారణంగా ఈ బోన్ సూప్ ను గొర్రె, కోడి, పంది ఎముకలను మరిగించి తయారు చేస్తారు. ఇది కేవలం మాంసాహారులకు మాత్రమే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలనుకునే అందరికీ సంపూర్ణ ఆరోగ్య పానీయంగా చెప్పుకోవచ్చు. మరి బోన్ సూప్ ను తాగడం వల్ల మానవ శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

బోన్ సూప్‌లో ఉండే ముఖ్య పోషకాలు:

  • కాల్షియం
  • ఫాస్ఫరస్
  • మగ్నీషియం
  • కోలాజెన్ & జెలాటిన్
  • గ్లూకోసామిన్
  • కొండ్రాయిటిన్
  • అమైనో యాసిడ్లు

బోన్ సూప్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:

1.ఎముకలు, కీళ్ల ఆరోగ్యానికి మంచిది:
ఈమధ్య కాలంలో చాలా మంది కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. కానీ, బోన్ సూప్‌లోని కోలాజెన్, గ్లూకోసామిన్, కొండ్రాయిటిన్ వంటి పదార్థాలు జాయింట్లకు నూనెబెట్టేలా చేస్తాయి. ఆర్థ్రైటిస్, గుండ్లవాతం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

2.చర్మం, వెంట్రుకలు, గోళ్లు మెరిసిపోతాయి:
బోన్ సూప్ లో ఉండే కోలాజెన్ చర్మానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. తరుచుగా తాగడం వల్ల వృద్ధాప్య లక్షణాలను తగ్గిస్తుంది. గోళ్లు ముడతలు లేకుండా, వెంట్రుకలు బలంగా మారుతాయి.

3.జీర్ణక్రియ మెరుగవుతుంది:
బోన్ సూప్ లో ఉండే జెలాటిన్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. గ్యాస్, అజీర్ణం, IBS (Irritable Bowel Syndrome) వంటి సమస్యల నుంచి ఉపశమనం ఇస్తుంది.

4.రోగ నిరోధక శక్తి పెరుగుతుంది:
బోన్ సూప్‌లో ఉండే అమైనో యాసిడ్లు ముఖ్యంగా ఆర్జినిన్, గ్లూటమైన్ వంటి విటమిన్స్ శరీర రక్షణ వ్యవస్థను బలపరుస్తాయి. దీనివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

5.ఒత్తిడి, మానసిక ఉల్లాసం:
బోన్ సూప్ తరుచుగా తాగడం వల్ల శరీరంలో గాబా (GABA) అనే హార్మోన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుంది, నిద్ర సరిగ్గా పడటానికి సహాయపడుతుంది.

బోన్ సూప్ ఎలా తయారుచేసుకోవాలి?

ముందుగా ఎముకలను(గొర్రె/కోడి/పంది) నీటిలో వేసి ఉడికించుకోవాలి. నీరు మరిగాక ఉప్పు, మసాలాలు, నీటితో కలపాలి. అలా 2 నుంచి 4 గంటలు మరిగించాలి. తరువాత కొంతసేపటికి చల్లారిన తరువాత తాగాలి.

బోన్ సూప్ ఎప్పుడు, ఎలా తాగాలి:

  • ఉదయం ఖాళీ కడుపుతో లేదా రాత్రి పూట తిన్న తర్వాత తాగడం ఉత్తమం
  • రోజూ ఒక గ్లాసు (250 ml) తాగడం మంచిది
  • యూరిక్ ఆమ్లం (uric acid) అధికంగా ఉన్నవారు తాగకూడదు
  • గౌట్ సమస్య ఉన్నవారు తాగకూడదు
  • కిడ్నీ రోగులు తాగకూడదు

బోన్ సూప్ అనేది ఆరోగ్యానికి బలాన్ని, పోషకాలు అందించే పానీయం. దీనిని ఇంట్లో తేలికగా తయారుచేసుకోవచ్చు. సహజంగా దొరికే పదార్థాలతో తయారవుతుంది కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.