Health benefits of eating kavi fruit every day
మనిషి ఆరోగ్యంపై ఆహారాం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మనం ఎంత మంచి, శుభ్రమైన ఆహరం తీసుకుంటే మన ఆరోగ్యం అంత బాగుంటుంది. అందులోనూ పండ్లు తినడం వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్, విటమిన్, పోషకాలు అందుతాయి. అయితే, ఆ పండ్లలో కూడా కివి పండుకి ఉన్న ప్రత్యేకతే వేరు. చూడటానికి చిన్నగా ఉంటుందో కానీ, ఇది పోషక విలువలతో నిండిన ఒక అద్భుతమైన ఫలం. దీనిని “చైనీస్ గూస్‌బెర్రీ” అని కూడా పిలుస్తారు. మరి ఈ పండు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
1.ఇమ్యూనిటీని పెంచుతుంది:
కివి పండులో విటమిన్ C అధికంగా ఉంటుంది. ఒక చిన్న కివి పండు 70 నుంచి 90 మి.గ్రా విటమిన్ C ను అందిస్తుంది. ఇది, శరీరంలో రోగనిరోధక శక్తిని బలపరచి వైరస్‌లు, బ్యాక్టీరియాల నుండి రక్షిస్తుంది. జలుబు, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు తగ్గించడంలో సహాయపడుతుంది. శరీరానికి యాంటీఆక్సిడెంట్లుగా పనిచేసే ఫ్లావనాయిడ్లు కూడా అందుతాయి
2.జీర్ణక్రియ మెరుగవుతుంది:
కివి పండులో ఫైబర్ అధికంగా ఉంటుంది. అలాగే ఇందులో ఆక్టినిడిన్ (Actinidin) అనే ఎంజైమ్ ఉంటుంది. దీనికి ప్రోటీన్లను విచ్ఛిన్నం చేసే ప్రత్యేకమైన శక్తిని కలిగి ఉంటుంది. ఇది జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు తగ్గుతాయి.
3.హృదయ ఆరోగ్యానికి మేలు:
కివి పండులో పొటాషియం, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి మొత్తం కలసి గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి HDL ను పెంచుతుంది.
4.చర్మం, అందానికి సహాయపడుతుంది:
కివిలో ఉండే విటమిన్ C, E చర్మానికి తేమను అందించి, వృద్ధాప్యాన్ని ఆలస్యంగా వచ్చేలా చేస్తుంది. చర్మం మెరిసేలా చేస్తుంది, మొటిమలు, ముడతలు, డార్క్ సర్కిళ్స్ తగ్గించడంలో సహాయం చేస్తుంది. చర్మ కణాల మరమ్మతుకు సహాయపడుతుంది.
5.ఐరన్ శోషణను మెరుగుపరుస్తుంది:
కివిలో ఉన్న విటమిన్ C, శరీరంలో ఐరన్‌ను గ్రహించడానికి అనువుగా చేస్తుంది. ఇది ముఖ్యంగా ఎముక మజ్జకు, హీమోగ్లోబిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. అనేమియా ఉన్నవారికి ఇది సహాయకారిగా ఉంటుంది. రక్తహీనతను తగ్గిస్తుంది. రక్తంలో ఐరన్ శాతన్ని పెంచుతుంది.
చిన్నదైన కివి పండు పెద్ద ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. ఇది ప్రతి ఇంట్లో ఆరోగ్యకరమైన డైట్‌లో భాగం కావాలి. రోజూ ఒక కివి పండు తీసుకోవడం వల్ల మీకు ఇమ్యూనిటీ, జీర్ణక్రియ, చర్మ ఆరోగ్యం వంటి అనేక రకాల లాభాలు అందుతాయి.