Lotus Roots: తామర పువ్వు ఎంత అందంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ పువ్వును చాలా మంది చాలా రకాలుగా ఉపయోగిస్తారు. అందం కోసం, అలంకరణ కోసం వాడతారు. అయితే, తామర అనేది కేవలం అందం కోసమే కాదు ఆరోగ్యం విషయంలో కూడా విశేషంగా సహాయపడుతుందట. ప్రత్యేకంగా తామర వేర్లు. అవును తామర వేర్లు మానవ ఆరోగ్యానికి ఎంతో మెలసి చేస్తుందట. దీనిలో విలువైన ఔషధ గుణాలు ఉన్నాయట. (Lotus Roots)మరి పోషకాలు ఏంటి? ఎలాంటి సమస్యలను నయం చేయగలవు అనే విషయాల గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
Health Tips: పారాసిటమోల్ ఎక్కువగా వాడుతున్నారా.. మీ లివర్ డేంజర్ లో పడినట్టే
తామర వేర్లలో ఉండే పోషకాలు:
- విటమిన్ C
- విటమిన్ B6
- డైటరీ ఫైబర్
- పొటాషియం
- మాంగనీస్
- ఐరన్
- ఫోస్ఫరస్
- ప్రోటీన్లు
- కార్బోహైడ్రేట్లు
తామర వేర్ల వల్ల ఆరోగ్య ప్రయోజనాలు:
1.ఊబకాయం నివారణ:
తామర వేర్లలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. అలాగే, ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి, దీనికి తినడం వల్ల పొట్ట నిండిన అనుభూతిని కలుగుతుంది. తద్వారా అధికాహారం తినకుండా నియంత్రణ సాధ్యమవుతుంది.
2.జీర్ణక్రియ మెరుగవుతుంది:
తామర వేర్లలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియకు అద్భుతంగా తోడ్పడతాయి. కాలేయాన్ని శుభ్రపరచడంలో, ఆమ్లత, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించడంలో ఉపయోగపడతాయి.
3.రోగ నిరోధక శక్తిని పెంచుతుంది:
విటమిన్ C అనేది శరీరానికి ప్రధాన యాంటీఆక్సిడెంట్. తామర వేర్లలో విటమిన్ C పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తుంది. అలాగే, శరీర రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది.
4.హృదయ ఆరోగ్యానికి మంచిది:
తామర వేర్లలో పొటాషియం అధికంగా ఉండటం వల్ల రక్తపోటును నియంత్రణలో ఉంటుంది. కాబట్టి, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
5.రక్తహీనత నివారణ:
తామర వేర్లలో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది రక్తహీనత (అనేమియా) సమస్యను నివారించడంలో సహాయపడతాయి. ఎర్ర రక్తకణాల ఉత్పత్తిని పెంచుతుంది.
6.చర్మ ఆరోగ్యానికి మేలు:
తామర వేర్లలో ఉండే విటమిన్ C తో, యాంటీఆక్సిడెంట్లు చర్మానికి సహజమైన కాంతిని పెంచి వృద్ధాప్య లక్షణాలను తగ్గిస్తాయి. చర్మం కాంతివంతంగా మారుతుంది.
తామర వేర్లను ఇలా తినండి:
- కూరలుగా చేసుకోవచ్చు.
- ముక్కలు చేసి ఫ్రై చేసుకుని తినవచ్చు
- తులసి, తామర వేర్ల టీగా కూడా చేసుకోవచ్చు
- చిప్స్, స్నాక్స్‌లుగా తీసుకోవచ్చు.