Macadamia Nuts Benefits: మెక‌డేమియా న‌ట్స్ గురించి మీకు తెలుసా.. పోషకాల నిధి.. తప్పకుండ తినండి

మెక‌డేమియా న‌ట్స్ లో మోనో అన్‌శాచురేటెడ్ కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి శ‌ర‌రీంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ను త‌గ్గిస్తాయి.

macadamia nuts benefits

Macadamia Nuts: మెక‌డేమియా న‌ట్స్.. పేరు చాలా వింతగా ఉంది కానీ, ఇది అందించే పోషకాలు మాత్రం అన్నీ ఇన్నీ కాదు. అందుకే ఈ నట్స్ ని పోషకాలు నిధి అంటారు. నిజానికి మనకు తెలిసిన నట్స్ బాదం, కాజు, వాల్ నట్స్ కానీ, మెక‌డేమియా న‌ట్స్ కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. క్రీమ్ లాగా ఎంతో రుచిగా ఉండే ఈ మెక‌డేమియా న‌ట్స్ ఆరోగ్యానికి అవసరమైన క్యాల‌రీలు, కొవ్వులు అందిస్తాయి. అందుకే ఈ న‌ట్స్‌ను మన రోజువారీ ఆహరంలో భాగం చేసుకుంటే అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. మరి మెక‌డేమియా న‌ట్స్‌ వల్ల మన శరీరానికి అందే పోషకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మెక‌డేమియా న‌ట్స్ లో మోనో అన్‌శాచురేటెడ్ కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి శ‌ర‌రీంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ను త‌గ్గిస్తాయి. మంచి కొలెస్ట్రాల్ ను పెంచడంలో సహాయపడతాయి. కాబట్టి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్స్ వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుంది. మెక‌డేమియా న‌ట్స్‌లో పొటాషియం ర‌క్త స‌ర‌ఫ‌రాను మెరుగు పరుస్తుంది. కాబట్టి బీపీ నియంత్ర‌ణ‌లో ఉంటుంది. ఇంకా వీటిలో ఫ్లేవ‌నాయిడ్స్‌, టోకోట్రియ‌నోల్స్ జాబితాకు చెందిన యాంటీ ఆక్సిడెంట్లు, విట‌మిన్ ఇ శ‌రీరానికి హాని చేసే ఫ్రీ ర్యాడిక‌ల్స్‌ను నిర్మూలిస్తాయి. ఆక్సీక‌ర‌ణ ఒత్తిడిని తగ్గిస్తాయి. కాబట్టి క్యాన్స‌ర్‌, డ‌యాబెటిస్‌, నాడీ సంబంధ స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి.

అధిక బ‌రువుతో బాధపడుతున్నవారికి ఈ న‌ట్స్‌ ఒక వ‌రం అనే చెప్ప‌వ‌చ్చు. రోజూ గుప్పెడు మెక‌డేమియా న‌ట్స్‌ను తినడం వల్ల శ‌రీరంలోని కొవ్వు క‌రుగుతుందని సైంటిస్టులు చేప‌ట్టిన ప‌రిశోధ‌న‌ల్లో తేలింది. శ‌రీర మెట‌బాలిజం మెరుగు ప‌డి కొవ్వు తొందరగా కరిగిపోతుంది. అంతేకాకుండా మెక‌డేమియా న‌ట్స్‌ వల్ల జీర్ణ క్రియ మెరుగు ప‌డుతుంది. గ్యాస్‌, మ‌ల‌బ‌ద్ద‌కం, అసిడిటీ నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

ఈ న‌ట్స్‌లో ఉండే యాంటీ ఇన్ ఫ్లామేట‌రీ గుణాలు నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నాన్ని కలిగిస్తాయి. ఆర్థ‌రైటిస్ ఉన్న‌వారికి ఇది ఒక దివ్యౌషధం అనే చెప్పాలి. మెక‌డేమియా న‌ట్స్‌లో ఉండే ఒమెగా 7, ఒమెగా 9 ఫ్యాటీ యాసిడ్లు మెద‌డు ప‌నితీరును మెరుగు ప‌రుస్తాయి. మ‌తిమ‌రుపు తగ్గిస్తాయి. డిప్రెష‌న్‌, ఒత్తిడి, ఆందోళ‌న వంటి మాన‌సిక స‌మ‌స్య‌లను దూరం చేస్తుంది.