Paracetamol Side effects
పారాసెటమాల్.. ఈ టాబ్లెట్ గురించి తెలియనివారంటూ ఉండరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతలా చాలా మంది జీవితాల్లో కలిసిపోయింది ఈ టాబ్లెట్. జ్వరం, తననొప్పి, ఒళ్లునొప్పులు, జలుబు ఇలా చాలా తరుచుగా వచ్చే ప్రతీ సమస్యకు ఇదే పరిష్కారం. ప్రతీ దానికి ఇదే టాబ్లెట్ వాడతారు చాలా మంది. అయితే, రోగం నయం చేసుకోవడానికి ప్రథమ చికిత్సగా ఈ టాబ్లెట్స్ వేసుకోవడం మంచిదే కానీ, డోసేజ్ పెరిగితే మాత్రం ప్రమాదం అంటున్నారు ప్రముఖ ఫీజిషన్, డయాబెటాలజస్ట్ డాక్టర్ కావ్య. ఇంకా చాలా విషయాల గురించి ఆమె వివరించారు. మరి పారాసెటమాల్ అధికంగా వాడటం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి? వాటిని నుండి బయటపడాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాల గురించి డాక్టర్ కావ్య ఎం చెప్పారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
1.లివర్ ప్రమాదాం (Liver Damage):
పారాసెటమాల్ ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల లివర్ శక్తిని కోల్పోతుంది. పని తీరు కూడా దెబ్బతింటుంది. కొన్ని సందర్భాల్లో లివర్ ట్రాన్స్‌ప్లాంట్ అవసరం అయ్యే అంత ప్రమాదస్థాయికి వెళ్లే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఆల్కహాల్ తాగేవారికి ఇది మరింత ప్రమాదకరం.
2. వాంతులు, నొప్పులు, మలబద్ధకం:
డోసేజ్ పెరిగితే మాత్రం ప్రమాదం అంటున్నారు ప్రముఖ ఫీజిషన్, డయాబెటాలజస్ట్ డాక్టర్ కావ్య.పారాసెటమాల్ ఓవర్‌డోస్ లో తీసుకోవడం వల్ల అది జీర్ణ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. క్రమంగా ఒళ్ళు నొప్పులు, వాంతులు, విరేచనాలు అవుతాయి.
3.చర్మంపై అలర్జిక్ ప్రతిక్రియలు:
పారాసెటమాల్ అధికంగా తీసుకోవడం వల్ల చర్మం సమస్యలు రావచ్చు.మెడిసిన్ రియాక్షన్ వల్ల చర్మంపై ఎర్రటి ర్యాషెస్, వాపు, ముడతలు వచ్చే అవకాశం ఉంది. అరుదుగా వచ్చే SJS అనే తీవ్ర చర్మ వ్యాధి వచ్చే ప్రమాదం కూడా ఉంది.
4.కిడ్నీ సమస్యలు:
పారాసెటమాల్ టాబ్లెట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీలపై ప్రభావం పడి అవి బలహీనంగా తయారవుతాయి. కిడ్నీల ఆరోగ్యం దెబ్బతిని వాటి పనితీరు మందగిస్తుంది.
5. మెదడుపై ప్రభావం:
పారాసెటమాల్ అధిక మోతాదులో వాడటం వల్ల మెదడుపై ప్రభావం పది మూర్ఛ, కామాలోకి వెళ్లే ప్రమాదం కూడా ఉంటుంది.