Health problems caused by using aluminum foil
మారుతున్న కాలానికి అనుగునంగా కొత్త కొత్త పోకడలు మన ముందు వస్తున్నాయి. అలాంటివాటిలో ఒకటి అల్యూమినియం ఫాయిల్. దీనిని వంటలలో, ఫుడ్ స్టోరేజ్, ఫుడ్ పార్సిల్స్ కోసం విస్తృతంగా ఉపయోగించబడుతుంది. దీనిని ఉపయోగించడం సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ దీర్ఘకాలికంగా వాడటం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. మరి అల్యూమినియం ఫాయిల్ వల్ల కలిగే ఆరోగ్య నష్టాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
1.అల్యూమినియం శరీరంలో చేరే ప్రమాదం:
తక్కువ వేడి పదార్థాలైనా, ఎక్కువగా ఉప్పుగా ఉండే పదార్థాలను అల్యూమినియం ఫాయిల్‌లో పెట్టినప్పుడు, అల్యూమినియం అనేది ఆహారంలోకి లీచింగ్ అవుతుంది. ఇది శరీరంలో చేరినప్పుడు రకరకాల రోగాలు వచ్చే ప్రమాదం ఉంది.
2. మెదడు సంబంధ సమస్యలు:
ఎక్కువ మోతాదులో అల్యూమినియం శరీరంలో చేరినప్పుడు, ఇది నరాలకు హాని కలిగించే అవకాశం ఎక్కువగా ఉంది. కొన్ని పరిశోధనల ప్రకారం అల్జీమర్స్ వంటి మెదడు సంబంధిత వ్యాధులకు కూడా కారణం కావచ్చు.
3.మూత్రపిండాలపై ప్రభావం:
అల్యూమినియం అధికంగా శరీరంలో చేరడం వల్ల మూత్రపిండాలు దానిని వాడకట్టడం, బయటుకు పంపడం చాలా కష్టం అవుతుంది. దీని వల్ల మూత్రపిండాల పనితీరులో అంతరాయం కలగవచ్చు. ప్రత్యేకించి అప్పటికే మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్నవారు అల్యూమినియం వాడకంలో జాగ్రత్త వహించాలి.
4.నరాల వ్యాధులు:
అల్యూమినియం ఫాయిల్ వాడకం నరాల పై ప్రభావం తీవ్ర ప్రభావం చూపిస్తుంది. దీనివల్ల న్యూట్రోక్సిక్ లక్షణాలు కనిపించవచ్చని కొన్ని అధ్యయనాలు చెప్తున్నాయి. అల్యూమినియం మరీ ఎక్కువగా శరీరంలో నిల్వ అయితే, ఇది పక్షవాతం, మెదడు పనితీరు తగ్గుదల వంటి సమస్యలకు దారితీయొచ్చు.
5.హార్మోనల్ అసమతుల్యత:
అధిక అల్యూమినియం శరీరంలో హార్మోన్ ఉత్పత్తిని అడ్డుకుంటుంది. ముఖ్యంగా ఎస్ట్రోజన్ వంటి హార్మోన్లపై ప్రభావం చూపవచ్చని పరిశోధనలు చెప్తున్నాయి. ఇది మహిళలలో మెన్స్ట్రుయల్ సైకిల్ లో భంగం కలగడానికి కారణమవుతుంది.