Health Tips: మన ఆహారంలో అన్ని రకాల పోషకాలు ఉండటం చాలా అవసరం. ఎందుకంటే, శరీరానికి అవసరమైన సమగ్ర పోషకాలను మనం తీసుకునే ఆహరం నుండే లభిస్తాయి. అయితే, చాలామంది ఆరోగ్య పరిరక్షణ, మానసిక విశ్వాసాలలో భాగంగా కేవలం శాకాహారాన్ని (వెజిటేరియన్ డైట్) తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ, నాన్ వెజిటేరియన్ ఆహారం (మాంసం, చేపలు, గుడ్లు మొదలైనవి) పూర్తిగా తీసుకోకుండా ఉండటం వల్ల కొన్ని (Health Tips)రకాల పోషకాల లోపం కలగవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాదు, సంపూర్ణ ఆరోగ్యం కోసం నం వెజ్ తినడం కూడా అవసరం అని చెప్తున్నారు. మరి నం వెజ్ తినకపోవడం వల్ల కలిగే ఆ సమస్యల గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
Health Tips: కాలి కడుపుతో టీ, కాఫీ తాగుతున్నారా? నయం చేయలేని రోగాలు రావొచ్చు.. జాగ్రత్త సుమీ
1.ప్రోటీన్ లోపం:
నాన్ వెజిటేరియన్ ఆహారాల్లో ఉండే సంపూర్ణ ప్రోటీన్లు శరీరానికి అత్యవసరం. వీటిలో అవసరమైన అమినో ఆమ్లాలను పుష్కలంగా ఉంటాయి. వెజిటేరియన్ డైట్‌లో ఇవన్నీ లభించకపోవచ్చు. కాబట్టి, పోటీని లోపం వల్ల కండరాల బలహీనత, జుట్టు ఊడటం, చర్మ సమస్యలు, జలుబు లాంటి సమస్యలు, తక్కువ శక్తి స్థాయిలు ఉండటం జరుగుతుంది.
2.విటమిన్ B12 లోపం:
B12 విటమిన్ అనేది ప్రధానంగా జంతు ఆధారిత ఆహారాల్లో మాత్రమే లభిస్తుంది. ఇది నరాల ఆరోగ్యం, రక్తకణాల ఉత్పత్తికి అత్యవసరం అవుతుంది. దీని లోపం వల్ల నరాల సంబంధిత సమస్యలు, మానసిక ఆందోళన, మెమరీ తగ్గుదల, రక్తహీనత (అనీమియా), అలసట లాంటి సమస్యలు తలెత్తవచ్చు.
3.ఐరన్ లోపం:
నాన్ వెజిటేరియన్ ఆహారాల్లో ఉండే “హీమ్ ఐరన్” సులభంగా జీర్ణమవుతుంది. కూరగాయలలో ఉన్న “నాన్-హీమ్ ఐరన్” శోషణ రేటు తక్కువగా ఉంటుంది. కాబట్టి, ఒకవేళ ఇది తక్కువైతే మానసిక మానదండత, తలనొప్పులు, మతిమరుపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు తలెత్తవచ్చు.
4.ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ లోపం:
ఇవి ముఖ్యంగా చేపల వంటి సముద్ర ఆహారాల్లో అధికంగా లభిస్తాయి. గుండె ఆరోగ్యం, మెదడు అభివృద్ధి, కంటి ఆరోగ్యం కోసం ఇవి చాలా అవసరం. ఒకవేళ ఇది తగ్గితే.. మానసిక ఉల్లాసం లోపం (డిప్రెషన్), మేధస్సు మందగించటం, గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
5.జింక్, క్రియేటిన్ లోపం:
జింక్ శరీరంలోని రోగనిరోధక వ్యవస్థకు, క్రియేటిన్ కండర శక్తికి అవసరం. ఈ రెండు ప్రధానంగా జంతు ఆధారిత ఆహారం నుండే లభిస్తుంది. వీటి లోపం వల్ల.. మందమైన ఇమ్మ్యూనిటీ, మంటలు, ముట్టుబడి తగ్గిపోవడం, కండరాల బలహీనత వంటి సమస్యలు రావచ్చు.