Survey: సారిడాన్ తలనొప్పి సర్వే రెండవ ఎడిషన్‌ను విడుదల చేసింది. ఈ సమగ్ర నివేదిక కోవిడ్ (Covid) మహమ్మారి అనంతర కాలంలో వ్యక్తులలో పెరుగుతున్న ఒత్తిడిని పరిశీలించింది. విభిన్న భౌగోళిక ప్రాంతాల్లో ఉన్న ప్రజల తలనొప్పితో దాని సహసంబంధాన్ని అన్వేషించింది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన టోటల్ సర్వీస్ మార్కెట్ పరిశోధన సంస్థ అయిన HANSA రీసెర్చ్ ఈ సర్వేను నిర్వహించింది. ఇందులో వ్యక్తులు ఎదుర్కొనే ఒత్తిడి స్థాయిలపై సమగ్ర అవగాహనను అందించడానికి 22-45 సంవత్సరాల వయస్సు వర్గాలలోని వ్యక్తులలో లింగం, శ్రామిక వర్గం, వయస్సు, జనాభాతో సహా అనేక రకాల కోణంలో ఈ సర్వే నిర్వహించారు.
Haryana : డాక్టర్ వృత్తిని విడిచిపెట్టి వ్యాపార రంగంలో దూసుకుపోతున్న డైనమిక్ లేడీ… ఎవరంటే..
ఈ విస్తృతమైన అధ్యయనం 20 పట్టణాల నుంచి 5,310 మంది స్పందనలను తీసుకున్నారు. ఇందులో 15 రాష్ట్రాల్లోని కీలకమైన టైర్ 1, టైర్ 2 పట్టణాలకు చెందిన వ్యక్తులు ఉన్నారు. ఈ నివేదిక ప్రకారం తలనొప్పిని అనుభవించిన స్పందన దారులలో ఆశ్చర్యపరిచే రీతిలో 93% మంది పెరుగుదల ఉందని వెల్లడించారు. ఇది నేరుగా పెరిగిన ఒత్తిడి స్థాయిలతో ముడిపడి ఉంది.
Viral Video: వీడియో వైరల్ కావడం కోసం.. రైలు దూసుకొస్తున్నా పట్టాల మీదే యువకుడు.. చివరకు..
మహమ్మారి తర్వాత వారి ఒత్తిడి స్థాయిలు పెరిగినట్లు ప్రతి ముగ్గురిలో ఒకరు భావించినట్లు నివేదిక వెల్లడించింది. పని చేసే, పని చేయని జనాభా రెండింటికీ ఆర్థిక సమస్యలు, పని ఒత్తిడి ప్రధాన ఒత్తిళ్లుగా సూచించబడ్డాయి. ఇతర కారణాలతోపాటు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు వంటివి సాధారణంగా కనిపిస్తున్నాయి. మహమ్మారి అనంతర ప్రపంచంలో సమర్థవంతమైన ఒత్తిడి నిర్వహణ వ్యూహాల అవసరాన్ని ఈ పరిశోధనలు ప్రధానంగా వెల్లడించాయి.
Pawar vs Pawar: వయసు మించిపోయిందన్న అజిత్ పవార్ వ్యాఖ్యలపై గట్టి కౌంటర్ ఇచ్చిన శరద్ పవార్
టైర్ 1 పట్టణాలలో 90 శాతం కంటే ఎక్కువ తలనొప్పి ఉన్న ఏకైక నగరం ముంబై అయితే చెన్నై 89 శాతం వద్ద ఉంది. ఇక టైర్ 2 పట్టణాలలో అహ్మదాబాద్, భువనేశ్వర్‌లలో 99 శాతం మంది తలనొప్పిని ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు. తర్వాత మధురై (96%), ఇండోర్ (94%) నగరాలు ఉన్నాయి.