Alkaline water benefits
మనిషికి నీరు అనేది జీవనాధారం అనే చెప్పాలి. రోజుకు నీరు ఎంత ఎక్కువగా తాగితే ఆరోగ్యం అంత మంచిది ఉంటుంది అని నిపుణులు చెప్తూనే ఉంటారు. ఆ నీటిలో కూడా రకరకాల నీరు అందుబాటులోకి వచ్చింది. అందులో ఆల్కలైన్ వాటర్ ఒకటి. ఈ నీరు తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. మరి నిజంగా ఆల్కలైన్ వాటర్ ఆరోగ్యానికి మంచివేనా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ఆల్కలైన్ వాటర్ లో కూడా రెండు రకాలు ఉన్నాయి. ఒకటి నేచురల్ ఆల్కలైన్ వాటర్, రెండవది ఆర్టిఫిషియల్ ఆల్కలైన్ వాటర్.
1.ఆమ్లతను తగ్గించటం:
ఆల్కలైన్ వాటర్ తాగడం వల్ల శరీరంలోని అత్యధిక ఆమ్లత తగ్గుతుంది. జీర్ణ సమస్యలను కూడా తగ్గిస్తుంది.
2. హైడ్రేషన్ మెరుగవుతుంది:
కొన్ని అధ్యయనాల ప్రకారం ఆల్కలైన్ వాటర్‌లో మినరల్స్ ఉండటం వలన శరీరానికి వేగంగా శక్తి అందుతుంది. ముఖ్యంగా వ్యాయామం చేసే వారిలో రీహైడ్రేషన్‌కు ఉపయోగపడుతుంది.
3.యాంటీఆక్సిడెంట్ గుణాలు:
ఆల్కలైన్ వాటర్‌లో నెగటివ్ ఓఆర్ఆర్‌పి ఉండటంతో ఇది రాడికల్స్ తో పోరాడే శక్తిని అందిస్తుంది. దీనివల్ల క్యాన్సర్ కారకాలు నశించే అవకాశం ఉంది.
4.ఎముకల ఆరోగ్యం:
ఆల్కలైన్ వాటర్లో కాల్షియం, మెగ్నీషియం వంటి మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది ఎముకల బలానికి సహాయపడుతుంది.
1.అమ్లాలను పూర్తిగా తక్కువ చేయడం ప్రమాదకరం;
ఆల్కలైన్ వాటర్ శరీరంలోని ఆమ్లతను తగ్గిస్తుంది. కానీ, శరీరానికి కొన్ని ఆమ్లతల అవసరం. దీనివల్ల కడుపులో హైడ్రోక్లోరిక్ యాసిడ్ తగ్గడం జరుగుతుంది. ఇది జీర్ణక్రియను దెబ్బతీసే ప్రమాదం ఉంది.
2.ఆల్కలోసిస్ ప్రమాదం:
ఎక్కువ మోతాదులో ఆల్కలైన్ వాటర్ తీసుకుంటే ఆల్కలోసిస్ రావచ్చు. ఇది తలనొప్పి, వాంతులు, మణికట్టు, పాదాలలో సంకోచం, గందరగోళం లాంటి పరిస్థితులకు దారితీస్తుంది.
3.పేగు బ్యాక్టీరియా ప్రభావం:
ఆల్కలైన వాటర్ వల్ల పేగుల్లోని సహజమైన ఆమ్లత మారిపోయే ప్రమాదం ఉంది. ఇది మంచివైన బ్యాక్టీరియాపై ప్రభావం చూపిస్తుంది.