dust allergy
Dust Allergy : గాలిలోని ఉన్న దుమ్ము, ధూళీ కణాల కారణంగా ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. ముఖ్యంగా వీటి కారణంగా వచ్చే డస్ట్ అలర్జీ శ్వాస సంబంధిత సమస్యలకు కారణమౌతుంది. కొన్ని రకాల రేణువుల నుంచి కూడా ఈ సమస్య పెరిగేలా చేస్తాయి. ముఖ్యంగా చలికాలంలో పూలు, చెట్లు, గడ్డి నుంచి కూడా డస్ట్ అలర్జీక్ రియాక్షన్స్ అధికంగా ఉంటాయి. గాలిలో ఉండే పుప్పొడి కణాలు, జంతువుల వెంట్రుకలు, చుండ్రు, ఫంగస్ ఇలా అనేక రకాల బ్యాక్టీరియా కూడా అలర్జీకి కారణమవుతాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ముక్కు కారడం, కళ్ల వాపు, ముక్కు, గొంతులో దురద, దగ్గు, తలనొప్పి, అలసట, బలహీనత వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
డస్ట్ అలర్జీని పోగొట్టే ఇంటి చిట్కాలు ;
1. తేనె ;అలర్జీని తగ్గించడానికి తేనె సహయపడుతుంది. ప్రతి రోజు నేరుగా రెండు చెంచాల తేనెను తీసుకోవాలి. తేనెను ఒక కప్పు నీటిలో కలపి తీసుకోవచ్చు. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి అలర్జీని తగ్గించడంలో సహాయపడతాయి.
2. యూకలిప్టస్ ; అలర్జీని తగ్గించుకునేందుకు యూకలిప్టస్, లావెండర్ నూనె కూడా ఉపయోగించవచ్చు. వేడి నీటిలో 4-5 చుక్కల యూకలిప్టస్, లావెండర్ నూనెను వేసి పీల్చుకోవాలి. ఈ రెండు నూనెలు శోథ నిరోధక, అనాల్జేసిక్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇది మంట, నొప్పిని తగ్గించడంలో తోడ్పడతాయి.
3. కలబంద ; కలబంద రసం అలర్జీని తగ్గిస్తుంది. ముందుగా కలబంద ఆకు తీసుకుని దాని తొక్కను తీసివేయాలి. అందులో నుంచి జెల్ తీసి మిక్సీలో వేసి ఒక కప్పు నీరు కలిపి మిక్సీ పట్టాలి. అనంతరం ఆ రసాన్ని తాగాలి. కలబందలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు బ్యాక్టీరియా, ఫంగస్ సమస్యలను తగ్గించే లక్షణాలు ఉన్నాయి. ఇవి అలర్జీల వలన కలిగే సమస్యలను తగ్గిస్తాయి.
4. నల్ల మిరియాలు ; అలర్జీని తగ్గించడానికి పసుపు, నల్ల మిరియాలు సహయపడతాయి. ఇందుకోసం ఒక కప్పు పాలలో అర టీ స్పూన్ కలపాలి. ఆ తర్వాత పాలను వేడిచేయాలి. ఆతర్వాత పాలను కాస్త చల్లార్చి అందులో చిటికెడు నల్ల మిరియాలు, కొన్ని చుక్కల తేనె కలిపి తీసుకోవాలి. పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. అలర్జీ సమస్యను నివరిస్తాయి.
5. అలాగే డస్ట్ అలర్జీని తగ్గించుకోవడానికి ఆపిల్ సైడర్ వెనిగర్ ఉపయోగపడుతుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో రెండు చెంచాల ఆపిల్ సైడర్ వెనిగర్ మిక్స్ చేసి తాగాలి. ఇందులో కొన్ని చుక్కల తేనె కూడా కలుపుకోవచ్చు. ఆపిల్ సైడర్ వెనిగర్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు అలర్జీని తగ్గించడంలో ఉపయోగపడతాయి.