Is hair loss due to alopecia? What is the cause?
ఈ మధ్య కాలంలో చాలా మంది జుట్టు రాలిపోవడం సమస్యతో బాధపడుతున్నారు. రాను రాను ఇది చాలా పెద్ద సమస్యగా మారింది. ఇది మనిషిని మానసికంగా దెబ్బతీస్తుంది. అయితే, కొంతమందిలో జుట్టు ఒత్తుగా, బలంగా ఉన్నప్పటికీ సడన్ గా జుట్టు మొత్తం రాలిపోవడం జరుగుతుంది. నిజానికి జుట్టు ఆరోగ్యానికి అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి. వాటిలో ముఖ్యమైనది అలోపేసియా (Alopecia). ఇది ఒక జుట్టు రాలే సమస్య. ఈ సమస్య ఈ మధ్య చాలా మందిని భయపెడుతోంది. మరి సమస్య ఎందుకు వస్తుంది? కారణాలు, నివారణ చర్యల గురించి వివరంగా తెలుసుకుందాం.
అలోపేసియా అంటే జుట్టు కోల్పోవడం అని అర్థం. ఈ సమస్య వల్ల కేవలం తలపై మాత్రమే కాకుండా, శరీరంలోని ఇతర భాగాలలో కూడా జుట్టు రాలిపోవడానికి దారితీస్తుంది. ఇది తాత్కాలికం కావచ్చు లేదా శాశ్వతంగా కూడా ఉండవచ్చు.
1.ఆటో ఇమ్యూన్ వ్యాధి: అలోపేసియా అనేది అరియాటా రకానికి చెందినది. దీనివల్ల మన సొంత రోగనిరోధక వ్యవస్థనే జుట్టు కండరాలను దాడి చేసి జుట్టు రాలిపోవడానికి కారణమవుతుంది.
2.హార్మోనల్ మార్పులు: థైరాయిడ్ సమస్యలు, గర్భధారణ, మెనోపాజ్ వంటి పరిస్థితుల్లో హార్మోన్ల సమతుల్యతలో మార్పు వస్తుంది. దీనివల్ల కూడా జుట్టు రాలుతుంది.
3.ఆనువంశికత: కుటుంబంలో వంశపారంపర్యంగా కూడా ఈ సమస్య రావచ్చు. మగవారిలో ఈ సమస్య ఇంకా ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది.
4.మానసిక ఒత్తిడి: తీవ్రమైన మానసిక ఒత్తిడి వల్ల కూడా జుట్టు రాలిపోవచ్చు. ఇది కూడా అలోపేసియాకు దారి తీయవచ్చు.
5.పోషకాహార లోపం: ఐరన్, ప్రొటీన్, బయోటిన్ వంటి పోషకాల లోపం వల్ల జుట్టు బలహీనపడి రాలిపోవచ్చు.
6. ఔషధ ప్రభావం: కొన్ని రకాల మందుల వాడటం వల్ల కూడా జుట్టు సమస్య వస్తుంది.
అలోపేసియా అనేది భయపడాల్సిన వ్యాధి కాదు. దీనికి చికిత్స ఉంది. కారణాలు తెలుసుకుని సమయానికి సరైన చికిత్స తీసుకుంటే మళ్ళీ జుట్టు పెరగడం సాధ్యమే.