COVID-19 May Cause Erectile Dysfunction : కరోనా వైరస్ పురుషులకు ప్రాణాంతకమని ఇప్పటికే వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా సోకిన పురుషుల్లో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయని అంటున్నారు. కరోనా వైరస్ కారణంగా పురుష జనాభాలో దీర్ఘకాలిక ప్రభావాలు ఎక్కువగా ఉంటున్నాయని చెబుతున్నారు.
మహిళల కంటే పురుషుల్లోనే కరోనా ప్రాణాంతకమని పలు అధ్యయనాలు తేల్చేశాయి. కరోనా బారిన పడకుండా ఉండేందుకు మాస్క్ లు ధరించడంతో పాటు భౌతిక దూరాన్ని తప్పక పాటించాలని సూచిస్తున్నారు.
కరోనా బారినపడిన పురుషుల్లో ఎక్కువమంది తీవ్ర అనారోగ్యానికి దగ్గరవుతుంటే.. మరికొంతమందిలో అంగస్తంభన సమస్యకు దారితీస్తోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. పురుషుల్లో దీర్ఘకాలిక నపుంసకత్వ ముప్పు అధికంగా ఉండే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
అంటు వ్యాధుల నిపుణుడు డాక్టర్ దేనా గ్రేసన్ కరోనా వ్యాప్తితో దీర్ఘకాలిక ప్రభావాలపై ప్రస్తావించారు. కరోనా సోకిన పురుషుల్లో ఎక్కువగా అంగస్తంభన సమస్యకు దారితీసే అవకాశం ఉందన్నారు.
వైరస్ సోకిన తర్వాత వారి vasculature సమస్యలకు కారణమవుతుందని గ్రేసన్ చెప్పారు. కరోనా వైరస్ ప్రాణం తీయడమే కాదు.. వాస్తవానికి దీర్ఘకాలిక, జీవితకాల అనారోగ్య సమస్యలను కారణమవుతుందని వైద్య నిపుణులు స్పష్టం చేశారు.
దీర్ఘకాల ప్రభావాల్లో ముఖ్యంగా బ్రెయిన్ ఫాగ్, జ్వరం వస్తూ పోవడం, గుండె వేగంగా కొట్టుకోవడం, ఊపిరితిత్తుల పనితీరులో అసాధారణ స్థితి, మూత్రపిండాలకు గాయం కావడం అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుందన్నారు. అంగస్తంభన సమస్య అనేది కరోనా దీర్ఘకాలిక లక్షణం కాదని అంటున్నారు.