Heart Attack: గుండెపోటుకు ప్రధాన కారణం ఆ సమస్యే.. తాజా అధ్యయనంలో వెలుగులోకి ఆసక్తికర విషయాలు

గుండెపోటుతో అకస్మాత్తుగా మృత్యువాత పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ సమస్య అన్ని వయస్సుల వారిని భయపెడుతోంది. అయితే, గుండెపోటు రావటానికి ప్రధాన కారణం తాజా అధ్యయనంలో వెల్లడైంది.

heart attack

Heart Attack: ఒకప్పుడు 60ఏళ్ల పైబడిన వారిలో మాత్రమే గుండె సమస్యలు కనిపించేవి.. కొద్దికాలం క్రితం వరకు 40ఏళ్లు పైబడిన వారిలో గుండెపోటు మరణాలు ఎక్కువగా కనిపించేవి. ప్రస్తుతం కాలంలో చిన్నవయస్సు వారి నుంచి పెద్దవారి వరకు గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఉన్నట్లుండి గుండెపోటు రావడం కుప్పకూలిపోవటం సర్వసాధారణంగా మారిపోయింది. ఇలాంటి కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటం అన్ని వయస్సుల వారిని ఆందోళనకుగురిచేస్తోంది. అయితే, గుండెపోటు మరణాలకు అనేక కారణాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. తాజాగా గుండెపోటు మరణాలపై ఢిల్లీలోని జీబీ పంత్ ఆసుప్రతి వైద్యుల బృందం పరిశోధనలు చేశారు.

Heart Attack : కార్డియాక్ అరెస్ట్ , గుండెపోటుకు ప్రమాద కారకాలు, లక్షణాలు , నివారణ !

తీవ్రమైన, స్వల్ప గుండెపోటుతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరిన 903 మంది రోగుల ఆరోగ్య పరిస్థితిని నెలరోజుల పాటు శాస్త్రీయ పద్దతిలో వైద్యులు పరిశీలించారు. అయితే, వీరి పరిశోధనలో ఆసక్తికర విషయాన్ని గుర్తించారు. గుండెపోటు బాధితుల్లో 92శాతం మంది ఒత్తిడితో బాధపడుతున్నట్లు గుర్తించారు. వారిలో కొంత మంది తీవ్ర స్థాయి ఒత్తిడితో, మరికొంత మంది స్వల్పస్థాయి ఒత్తిడితో బాధపడుతున్నారని తేల్చారు. ఇక్కడ ప్రధాన విషయం ఏమిటంటే.. ఒత్తిడితో బాధపడుతున్న వారిలో యువతే ఎక్కువగా ఉందని జీబీ పంత్ ఆసుపత్రి వైద్యులు బృందం చేసిన పరిశోధనలో వెల్లడైంది.

Heart Attack : ఈ గుండెకి ఏమైంది? బైక్ నడుపుతూ గుండెపోటుతో అక్కడికక్కడే మృతి, వీడియో వైరల్

ఈ పరిశోధనపై జీబి పంత్ ఆసుపత్రిలో కార్డియాలజీ ప్రొఫెసర్ డాక్టర్ గుప్తా మాట్లాడుతూ.. కొవిడ్ అనంతర కాలంలో దేశంలో మానసిక ఒత్తిడి యొక్క ప్రాబల్యం, గుండెపోటుతో దానిసంబంధాన్ని పరిశీలించడానికి ఎటువంటి అధ్యయనం జరగలేదని అన్నారు. మారుతున్న జీవనశైలి వల్ల వ్యక్తిగతంగా, వృత్తిపరంగా చాలా మంది ఒత్తిడితో బాధపడుతున్నారని, ఈ ఒత్తిడి గుండెపోటుకు దారితీస్తోందని ఆయన చెప్పారు. ఒత్తిడికితోడు ధూమపానం, మద్యపానం, వ్యాయామం లేకపోవటం, బీపీ, ఇన్సులిన్ తగ్గడం తదితర కారణాలు కూడా ఉన్నాయని మోహిత్ గుప్తా వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు