Eggshell face pack Benefits
సౌందర్య సంరక్షణలో గుడ్డు ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గుడ్డులోని తెల్లసొన చర్మానికి చాలా ప్రయోజనాలను ఇస్తుంది. అయితే, చాలా ముందుకి తెలియాని విషయం ఏంటంటే.. గుడ్డు పెంకు (Eggshell) కూడా చర్మానికి చాలా ప్రయోజనకరమట. చాలా మంది నిపుణులు సైతం ఇదే మాట చెప్తున్నారు. గుడ్డు పెంకులో కాల్షియం కార్బోనేట్, చిన్న మొత్తంలో ఇతర ఖనిజాలు కూడా ఉంటాయట. కాబట్టి ఈ పెంకులను పొడి చేసి పేస్ ప్యాక్ లాగా పెట్టుకోవడం వల్ల చర్మానికి పుష్కలంగా మేలు జరుగుతుందట. ఈ మధ్య కాలంలో చాలా మంది ఈ ఫేస్ ప్యాక్ ను ట్రై చేస్తున్నారు. మరి గుడ్డు పెంకుల ఫేస్ ప్యాక్ వల్ల కలిగే ఆ ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
చర్మాన్ని బిగుతుగా ఉంచుతుంది:
గుడ్డు పెంకులో ఉండే ఖనిజాలు ముఖంపై చర్మాన్ని బలంగా చేసి ముడతలు తగ్గించడంలో సహాయపడతాయి. ఇది కోలాజెన్ ఉత్పత్తిని ప్రేరేపించి, చర్మాన్ని బిగుతుగా ఉంచుతుంది.
మొటిమలను, నల్ల మచ్చలను తగ్గిస్తుంది:
పెంకును పొడిగా చేసి పేస్టుగా తయారుచేసి ముఖానికి అప్లై చేయడం వల్ల ఇది చర్మం లోతుల్లోకి వెళ్లి మలినాలను తొలగించి మొటిమలు రాకుండా నియంత్రిస్తుంది. అలాగే చాలా కాలంగా ఉన్న నల్ల మచ్చలను కూడా తొలగిస్తుంది. ఇందులో ఉండే సహజ యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు ముఖం పైన గల బాక్టీరియాను నాశనం చేస్తుంది.
చర్మానికి గ్లో ఇస్తుంది:
గుడ్డు పెంకు పౌడర్‌లో ఉండే మైనరల్‌లు మృత చర్మ కణాలను తొలగించడంలో సహాయపడతాయి. ఇది సహజ ఎక్స్ఫోలియేటర్‌గా పనిచేస్తూ, మొఖాన్ని ప్రకాశవంతంగా చేస్తాయి.
సూర్య రష్మిహానిని తగ్గిస్తుంది:
గుడ్డు పెంకులతో ఉండే కాల్షియం, ఇతర ఖనిజాలు చర్మాన్ని UV రేడియేషన్ నుంచి రక్షించడంలో సహకరిస్తాయి. ఇది సన్ టాన్ తగ్గించడానికి సహాయపడుతుంది.
ఒత్తిడివల్ల కలిగే చర్మ సమస్యలు మాయం:
గుడ్డు పెంకులో ఉండే సహజ పోషకాలు చర్మాన్ని శాంతింపజేసే లక్షణాలు కలిగి ఉంటాయి. ఇది చర్మాన్ని రిలాక్స్ చేస్తుంది, ముఖ్యంగా ధూళి, కాలుష్యం వలన గల ఇన్ఫ్లమేషన్‌ను తగ్గిస్తుంది.