Bone Cancer: భయపెడుతున్న బోన్ క్యాన్సర్.. లక్షణాలు ఇవే.. జాగ్రత్తపడకుంటే అంతే సంగతులు

ఎముకలో కణితులు ఏర్పడటాన్ని ఎముక క్యాన్సర్ అంటారు. దీనికి ప్రధాన కారణం ఇదే అనే లేదు. కానీ, DNA వచ్చే లో మార్పుల కారణంగానే ఈ సమస్య వస్తుంది అని నిపుణులు చెప్తున్నారు.

bone cancer symptoms

బోన్ క్యాన్సర్(ఎముక క్యాన్సర్).. ఈ మధ్య కాలంలో చాలా మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఎముకలో కణితులు ఏర్పడటాన్ని ఎముక క్యాన్సర్ అంటారు. దీనికి ప్రధాన కారణం ఇదే అనే లేదు. కానీ, DNA వచ్చే లో మార్పుల కారణంగానే ఈ సమస్య వస్తుంది అని నిపుణులు చెప్తున్నారు. ఇక ఈ వ్యాధి నిర్ధారణ విషయంలో ఎలాంటి ముందస్తు లక్షణాలు కూడా ఉండవు. ఈ వ్యాధి ముదిరాక గానీ తీవ్రత తెలియడం లేదు. అందుకే బోన్ క్యాన్సర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెప్తున్నారు.

ముఖ్యంగా బోన్ క్యాన్సర్ లో మూడు రకాలు ఉన్నాయి.
ఆస్టియోసార్కోమా: ఇది అత్యంత సాధారణమైన ఎముక క్యాన్సర్. ఇది ఎముక కణజాలం ఏర్పడే కణాలలో అభివృద్ధి చెందుతుంది. అందుకే ఇది టీనేజర్లలో ఎక్కువగా కనిపిస్తుంది.
ఎవింగ్ సార్కోమా: ఇది ఎముకలలో మరియు చుట్టుపక్కల ఉండే మృదు కణజాలంలో ఏర్పడుతుంది. ఇది కూడా ఎక్కువగా పిల్లలు, టీనేజర్లలో ఎక్కువగా కనిపిస్తుంది.
కాండ్రోసార్కోమా: ఈ కణితులు కీళ్ళు, ఎముకల మధ్య కదలికు సహాయపడే మృదువైన కణజాలంలో ఏర్పడుతుంది. పెద్ద వయస్కులలో ఈ సమస్య ఎక్కువగా వస్తుంది.

బోన్ క్యాన్సర్ యొక్క లక్షణాలు:
ఎముక క్యాన్సర్ లక్షణాల్లో మొదటిది కణితులు ఏర్పడి క్రమంగా పెరుగుతూ ఉంటాయి. ఎముక నొప్పి కూడా క్రమంగా పెరిగి విపరీతంగా మారుతుంది. రాత్రిపూట ఈ నొప్పి మరింతగా ఉంటుంది. ఎముక ప్రభావిత ప్రాంతం అంతా వాపు ఏర్పడుతుంది. కదలడంలో ఇబ్బంది, అలసట, జ్వరం లాంటి లక్షణాలు కూడా ఉంటాయి.

ఇక ఎముక క్యాన్సర్లకు అత్యంత సాధారణ చికిత్స లింబ్-స్పేరింగ్ సర్జరీ. దీనిలో కణితిని మరియు దాని చుట్టూ ఉన్న కొంత ఆరోగ్యకరమైన కణజాలాన్ని తొలగిస్తారు..
సమస్య తీవ్రతను బట్టి కొన్నిసార్లు మొత్తం అవయవాన్ని కూడా తొలగించాల్సి వస్తుంది. కాబట్టి ఎముక క్యాన్సర్ విషయంలో చాలా వరకు జాగ్రత్తలు వహించడం మంచిది. పైన తెలిపిన ఏ లక్షణం మీకు కనిపించినా వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్ళండి.