అంగస్తంభన సమస్యకు అద్భుతమైన డైట్.. ఈ ఆహారమే మీ ఆరోగ్యం!

  • Publish Date - December 6, 2020 / 01:06 PM IST

This Diet May Help Cure Erectile Dysfunction : ఆరోగ్యమే మహాభాగ్యమన్నారు… ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఉన్నవారిలో అనారోగ్య సమస్యలు దరిచేరవంటారు.. అది నిజమే.. ఎందుకంటే.. మనం తినే ఆహారం వల్లే అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.. హెల్తీ డైట్ పాటించేవారు ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందవచ్చు. ఆరోగ్యకరమైన జీవితం కోసం మధ్యధరా ఆహారాన్నే ఎంచుకోవాలని సూచిస్తోంది కొత్త అధ్యయనం..

హృద్రోగ సంబంధిత సమస్యల బారినపడకుండా ఉండాలంటే కొవ్వులేని ఆహారాన్ని తమ ఆహారంలో భాగంగా చేసుకోవాలని పోషక నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుత రోజుల్లో పురుషుల్లో ఎక్కువగా బాధిస్తోంది అంగస్తంభన సమస్య.. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలియక సతమతమైపోతుంటారు.



వాస్తవానికి అంగస్తంభన సమస్యకు అద్భుతమైన డైట్ ఉందంటున్నారు పోషక నిపుణులు.. ఈ ఆహారమే మీ ఆరోగ్యానికి రక్ష అంటున్నారు. అంగస్తంభన సమస్యను తొందరగా నివారించాలంటే మధ్యధరా ఆహారానికి అలవాటు పడాలని ఈ అధ్యయనం సూచిస్తోంది. మధుమేహం (డయాబెటిస్), గుండెజబ్బులు, కేన్సర్ వంటి ప్రాణాంతక రోగాలు దరిచేరకుండా ఈ ఫుడ్ డైట్ సాయపడుతుందని చెబుతున్నారు.



యూరాలజిస్ట్, డాక్టర్ Samuel Amanamah ప్రకారం.. వాస్తవానికి, అంగస్తంభన అనేది హృదయ సంబంధ వ్యాధులు, ఇతర తీవ్రమైన ఆరోగ్య పరిస్థితులతో ముడిపడి ఉందని అంటున్నారు. చాలా మంది పురుషుల్లో సమస్య బయటపడేంతవరకు తమకు ఈ పరిస్థితులు ఉన్నాయని తెలుసుకోలేక పోతున్నారు. కొత్త పరిశోధనల అధ్యయనం ప్రకారం.. మధ్యధరా ఆహారానికి దగ్గరగా ఉండే ఆహార ఎంపికలతో పురుషులు అంగస్తంభన సమస్యను ఎదుర్కోవచ్చునని అంటున్నారు.



డాక్టర్ బాయర్ బృందం హార్వర్డ్ యూనివర్శిటీలో 21, 469 మంది పురుషులపై అధ్యయనం జరిపారు. వారి ఆహార నాణ్యతపై సేకరించిన మునుపటి డేటాను పరిశీలించారు. 1986, 2014 మధ్య ప్రతి నాలుగు ఏళ్లకు ఒకసారి నివేదించారు.

వారిలో ఎవరైనా అంగస్తంభన సమస్యతో బాధపడుతున్నారా? లేదా హృదయ సంబంధ వ్యాధితో బాధపడుతున్నారా? లేదా ఎవరైనా మరణించారా? అని డేటాను సేకరించారు.

కూరగాయలు, పండ్లు, కాయలు, బీన్స్, తృణధాన్యాలతో కూడిన మధ్యధరా ఆహారాన్ని ఫాలో అయ్యే పురుషులు ఏ వయసులోనైనా అంగస్తంభన సమస్యను ఎదుర్కొనే అవకాశం ఉంది. ముఖ్యంగా 60 కంటే తక్కువ వయస్సు ఉన్న పురుషులు, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం తక్కువగా ఉంటుంది. అలాగే వీరిలో అంగస్తంభన సమస్యను ఎదుర్కొనే అవకాశం కూడా చాలా తక్కువగా ఉంటుంది.



మధ్యధరా ఆహారం తీసుకునే వారు చనిపోయే అవకాశం 30 శాతం తక్కువగా ఉందని అధ్యయనం కనుగొంది.తాజా పండ్లు, కూరగాయలు, ముఖ్యంగా ఆకుకూరలు వంటివి పాలకూర, కాలే, పిండి కాని కూరగాయలు వంటివి వంగ మొక్క, కాలీఫ్లవర్, ఆర్టిచోకెస్, టమోటాలు సోపు మొదలైనవి ఆహారంలో చేర్చుకోవాలి. ఆలివ్ నూనె, కాయలు, విత్తనాలు వంటివి బాదం, చిక్కుళ్లు, బీన్స్ ముఖ్యంగా కాయధాన్యాలు, చిక్పీస్, మూలికలు, సుగంధ ద్రవ్యాలు, ఒరేగానో, రోజ్మేరీ పార్స్లీ వంటి తృణధాన్యాలు, చేపలు, వారానికి రెండుసార్లు చేపలు తినాలంటున్నారు.