సమస్త జీవకోటికి ప్రాణాధారం జలం. జలం లేనిదే జీవం లేదు. నీరు లేకుంటే ప్రాణి మనుగడ ప్రశ్నార్థకమే. ఈ క్రమంలో ప్రపంచానికి ప్రతీ నీటిబొట్టు విలువ తెలియాలి.
సమస్త జీవకోటికి ప్రాణాధారం జలం. జలం లేనిదే జీవం లేదు. నీరు లేకుంటే ప్రాణి మనుగడ ప్రశ్నార్థకమే. ఈ క్రమంలో ప్రపంచానికి ప్రతీ నీటిబొట్టు విలువ తెలియాలి. ప్రాణంతో సమానంలో నీటిని జాగ్రత్తగా చూసుకోవాలి. వాడుకోవాలి. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఉండే పలు ప్రాంతాలలో నీటి కరవు తాండవిస్తోంది. నీరు చేతినిండా ఉన్నప్పుడు దుర్వినియోగం చేస్తే భవిష్యత్ తరాలకు నీటికొరత అతి త్వరలోనే వచ్చే ప్రమాదముంది. ఈ క్రమంలో నీటి ప్రాధాన్యతను తెలిపేందుకుమార్చి 22 ప్రపంచ జల దినోతవ్సాన్ని జరుపుతోంది యునైటెడ్ నేషన్.
Read Also : జై చంద్రబాబు అంటున్న రామ్ గోపాల్ వర్మ
ప్రపంచ జల దినోత్సవాన్ని మార్చి 22, 2014న విశ్వవ్యాప్తంగా పాటిస్తున్నారు. మంచి నీటి ప్రాధాన్యతను ప్రజలకు తెలియచేసేందుకు యునైటెడ్ నేషన్స్ మార్చి 22వ తేదీని ప్రపంచ జల దినోత్సవంగా నిర్వహిస్తోంది. మెరుగైన నీటి వనరుల ఉపయోగం, జల వనరుల సంరక్షణ ప్రపంచ జల దినోత్సవ ముఖ్య ఉద్దేశం. ప్రపంచ జల దినోత్సవమును ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ మార్చి 22 గా ప్రకటించడంతో ప్రపంచ వ్యాప్తంగా 1993 నుండి ప్రతి సంవత్సరం మార్చి 22 న జరుపుకుంటున్నారు.
1993 లో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ఆనాటి నుంచి గణనీయంగా అభివృద్ధి చెంది.. సాధారణ ప్రజలకు అవగాహన కల్పించేవిధంగా రూపొందించబడింది. జల దినోత్సవం రోజున యునైటెడ్ నేషన్స్, టోక్యోలో యుఎన్-వాటర్ డికేడ్ ప్రోగ్రాం ఆన్ అడ్వోకసీ అండ్ కమ్యూనికేషన్స్ పై జర్నలిస్ట్ వర్క్‌షాప్ ను నిర్వహించి వరల్డ్ వాటర్ డెవలప్‌మెంట్ నివేదికను విడుదల చేసింది.
మొత్తం భూభాగంలో 70.9 శాతం నీటితో నిండి వుంది. అందులో 86.5 శాతం సముద్రపు నీరు కాగా..1.7 శాతం భూగర్భ జలాలు..మరో 1.7శాతం మంచు రూపంలో ఉమిడి ఉంది. దీంతో భూమిమీద మొత్తం 2.5 శాతం మాత్రమే మంచినీరు ఉంది. అందులో 0.3 శాతం నదుల్లో, కాలువల్లో ప్రవహిస్తుంటుంది. మరి అతి కొద్ది శాతమే ఉండే నీటి వనరులను ప్రపంచ ప్రజలందరు పరిరక్షించుకోవాల్సిన అవసరం చాలా ఉంది.
నీటిని దుర్వినియోగం చేయటం..నీటి కాలుష్యానికి కారణమయ్యేవాటిని నిషేధించటం వంటి పలు అంశాలపై ప్రజలు అవగాహన పెంచుకోవాలి. భూమిపై మానవుడు సుభిక్షంగా..సురక్షితంగా మనుగడ సాగించాలి అంటే నీటిని రక్షించుకోవాలి. ఇది ప్రతీ ఒక్కరి బాధ్యతగా గుర్తుంచుకోవాలి. ఈ ప్రపంచ జల దినోతవ్సం రోజున యునైటెడ్ నేషన్ సూచనలను పాటించి..ప్రతి ఒక్కరు నీటి పరిరక్షణకు బాధ్యత వహించాలి.
Read Also : కొత్త ఆప్షన్ : రైలు టికెట్ బదిలీ చేసుకోవచ్చు