What are the special features of 35000 kg bomb salt?
Bamboo Salt: మనకు ఉప్పు అంటే సాధారణంగా వంటలకోసం వాడే ఉప్పు గురించి మాత్రమే తెలుసు కదా. దీని విలువ ఎంత ఉంటుంది. మహా అయితే కేజీ రూ.20 నుంచి రూ.30 ఉంటుంది. అయితే, నేను ఇప్పుడు చెప్పబోయే ఉప్పు కకేజీ ఎంతో తెలుసా? తెలిస్తే నోరెళ్లబెట్టడం ఖాయం. ఈ ఉప్పు కేజీ అక్షరాలా రూ.35000. అవును మీరు చదివింది నిజమే. అదే, కొరియాలో తయారయ్యే బాంబు సాల్ట్ (Bamboo Salt). ఇది ఒక అద్భుతమైన, అత్యంత ఖరీదైన ఉప్పు. దీనిలో ప్రపంచంలోనే అత్యంత విలువైనదిగా చెప్తారు. మరి అంతలా ఈ ఉప్పులో ఉండే ఆ ప్రత్యేకతలు ఏంటి అనేది ఇక్కడ తెలుసుకుందాం.
1.9 సార్లు కాల్చే ప్రక్రియ:
ఈ ఉప్పును ప్రత్యేకమైన బాంబు గొట్టాల్లో నింపి పైనుండి పసుపు మట్టి (Yellow Clay)తో మూసి, అతి అధిక ఉష్ణోగ్రతలో అంటే దాదాపు 1000°C నుంచి 1500°C వేడిలో కాల్చుతారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు 9 సార్లు కలుస్తారు. అందుకే దీనికి 9x రోస్టెడ్ సాల్ట్ అనే పేరు వచ్చింది. ఇలా చేయడం వల్ల ఉప్పులోని హానికరమైన లోహాలు తొలగిపోతాయి, శుద్ధి స్థాయిలో ఉప్పు తయారవుతుంది.
2.ఔషధ గుణాలు ఉన్న హీలింగ్ సాల్ట్:
బాంబు సాల్ట్‌ను కొరియన్ ప్రాచీన వైద్యంలో డిటాక్స్, జీర్ణ సమస్యలు, పేగుల శుభ్రతకు ఉపయోగిస్తారు. అలాగే ఇది మొటిమలు, మౌఖిక ఆరోగ్య సమస్యలు వంటి సమస్యల నుంచి కూడా కాపాడుతుంది. ఇందులో ఉన్న లౌరిక్ యాసిడ్, మినరల్స్ శరీరానికి సహజ రోగ నిరోధక శక్తిని అందిస్థాయి.
3.అద్భుతమైన మినరల్ కంటెంట్:
ఈ ఉప్పును 9 సార్లు కాల్చడం వల్ల లోపల నుంచి తేలికగా శరీరానికి అందేలా మారుతుంది. ఇందులో క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్ వంటి ముఖ్యమైన ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. అందుకే ఈ ఉప్పును మితంగా తీసుకుంటే శరీరంలోని మినరల్ లోపాలను తగ్గించుకోవచ్చు.
4. ఎసిడిటీ, pH బాలన్స్:
బాంబు ఉప్పు అనేది ప్రత్యేకమైన అల్కలైన్ ఉప్పుగా పరిగణించబడుతుంది. ఎందుకంటే, ఇది శరీరంలోని ఆమ్లతను తగ్గించి, pH స్థాయిని సమతుల్యంలో ఉంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది.
5.అత్యంత అరుదైన, లిమిటెడ్ ప్రొడక్షన్:
ఈ ఉప్పు చాలా అరుదుగా తయారు చేయబడుతుంది. కొరియాలో కొన్ని సంప్రదాయ కుటుంబాలు మాత్రమే ఈ ఉప్పును తయారు చేస్తాయి. అధిక ఖర్చు, శ్రమ, సమయం, నైపుణ్యం అవసరం అవడంతో ఎక్కువగా విలువగల ఉప్పుగా ఇది పరిగణించబడింది.
ఈ ఉప్పును ఎలా వాడతారు:
* తల నొప్పి, జీర్ణ సమస్యలు, పేగుల డిటాక్స్ కోసం నీటిలో కలిపి తాగుతారు.
* టూత్‌పౌడర్, ఔషధ క్రీములు, సబ్బులు, ఆరోగ్య సప్లిమెంట్స్‌లో ఉండే అవకాశం ఉంది.
జాగ్రత్తలు:
* ఇది సాధారణ వంట ఉప్పుగా వాడకూడదు.
* నిపుణుల సలహాతో మాత్రమే ఉపయోగించాలి.
* ఖచ్చితమైన సోర్స్ నుంచి మాత్రమే కొనాలి.