వూహాన్-కేరళ మధ్య సంబంధమేంటి?  

  • Publish Date - February 5, 2020 / 01:39 PM IST

భారతదేశంలో కరొనావైరస్ వచ్చిన ముగ్గరు అంతకుముందు వూహాన్ లో యూనివర్సిటీలో చదువుకున్నవాళ్లే. కేరళలో వుహాన్ అంటే చాలా పాపులర్. ఈ ఎడ్యుకేషన్ హబ్ కెళ్తే
బెస్ట్ ఎడ్యుకేషన్ దొరుకుందన్నది నమ్మకం. ఇది నిజంకూడా. ప్రపంచస్థాయి ప్రమాణాలతో వూహాన్ లో మెడికల్ కాలేజీలు నడుస్తాయి. ఇండియాలోని కాలేజీలన్నా బెటర్.
ఖర్చుకూడా భరించతగ్గదే. అందుకే కేరళ నుంచి అక్కడకు వేల మంది విద్యార్దులు చైనాకెళ్తారు.

ఖర్చు తక్కువ, సౌకర్యాలు, అంతర్జాతీయస్థాయి ప్రమాణాలు, ఇంగ్లీషు, అక్కడ చదవినవాళ్లు ఇక్కడ ఈజీగా క్వాలిఫికేషన్ ఎగ్జామ్ పాస్ కావడం వల్ల కేరళ విద్యార్దుల్లో వూహాన్
అంటే చాలా క్రేజ్.  బీజింగ్ కు 1000 కిలోమీటర్లు, షాంగైకు 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న వూహాన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ లో ఎక్కువమంది చేరుతారు.
వూహాన్ లో ప్రతి వీధిలోనూ ఇండియన్స్ కనిపిస్తారని అంటారు. అందులో ఎక్కువ మంది కేరళవాళ్లే. స్థానిక చైనీస్ కూడా ఇండియన్స్ అంటే ఆదరంగా చూస్తారు.

విదేశీ విద్యార్ధుల కోసం ఆరేళ్ల కోర్స్ ఉంది. అక్కడున్న సౌకర్యాలతో ఈ కోర్స్ చాలా పాపులర్. మా బ్యాచ్లో 70 మంది విదేశీ విద్యార్ధులున్నారు. ఆసక్తికరమంటంటే. అందులో 50 మంది కేరళవాళ్లే అని చెప్పారు ఐశ్వర్య. ఆమెది తిరువంతపురం. వూహాన్ లోని అంతర్జాతీయ ప్రమాణాల బట్టే మా అమ్మాయిని వూహాన్ పంపించానని ఓ తండ్రి అన్నారు. యేడాదికి ఖర్చు 5-6 లక్షలే. అందులోనే ఫీజు, వసతి, ఇతరత్రా. అదే ఇండియాలో ప్రైవేట్ మెడికల్  కాలేజీల్లో ఈ ఖర్చు రెండింతలు. అంతకన్నా ఎక్కువే. విదేశీ విద్యార్ధులతో కలసి చదువుకొంటారుకాబట్టి, నాలెడ్జ్ పెరుగుతుందన్నది ఆయన అశ. 

ఇటీవల వూహాన్ నుంచి తిరిగివచ్చిన రేవతిదీ తిరువనంతపురం. ఆమె వూహన్ లో ఎంబిబిఎస్ మూడో యేడు చేస్తున్నారు. అక్క్డడున్న ఫెలిసిటీస్ ఆమకు బాగా నచ్చాయి.
ఫ్యాకల్టీది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అంటారామె. అక్కడ చదివితే ఇండియాలో ఏ టాప్ మెడికల్ కాలేజీతో పోటీపడొచ్చన్నది ఆమె నమ్మకం. ఇంకోసంగతి వూహాన్ యూనివర్సిటికీ
భారతీయ ప్రభుత్వ గుర్తింపుకూడా ఉంది. Wuhan University School of Medicine 500 వందల మంది కేరళ విద్యార్ధులు చదువుకొంటున్నారు.

కరొనా వైరస్ ప్రమాదం నుంచి చైనా గట్టెక్కితే మొదటి ఫ్లైయిట్ ఎక్కడానికి కేరళ విద్యార్ధులు సిద్ధమని అంటున్నారు. కేరళలో 35 వైద్యకళాశాలున్నా వీళ్లెవ్వరూ ఇక్కడ చదువుకోవడానికి ఇష్టపడటంలేదు. మళ్లీ వుహాన్ కెళ్లడమే వీళ్లకు ఇష్టం. ఐతే ఎడ్యకేషన్ కన్సల్టెంట్స్ మాత్రం చైనాకన్నా రష్యాకెళ్లి చదువుకోవడమే బెటరని అంటున్నారు. అక్కడ వ్యాధుల ప్రమాదం తక్కువ.