కరోనాతో ప్రపంచవ్యాప్తంగా 76శాతం తగ్గిన గుండెజబ్బులు!

  • Publish Date - May 6, 2020 / 11:37 AM IST

ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్‌–19 ఆస్పత్రులు మినహా మిగతా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎమర్జెన్సీ వార్డులన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. సాధారణ పరిస్థితుల్లో అయితే హృద్రోగులు, క్యాన్సర్‌ రోగులు, రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారితో నిండిపోయి కనిపిస్తుంటాయి. కరోనా కష్ట కాలంలో మాత్రం కరోనా కేసులు తప్ప ఇతర అనారోగ్య సంబంధిత సమస్యలతో ఎమర్జెన్సీ వార్డుల్లో చేరేవారి సంఖ్య తగ్గిపోయింది. కరోనా కేసుల తీవ్ర పెరిగినప్పటి నుంచి కేసుల సంఖ్య భారీగా తగ్గుతూ వచ్చింది. మూడో వంతు నుంచి సగం వరకు కేసులు తగ్గాయని అంతర్జాతీయ డేటాలు చెబుతున్నాయి. 

గుండె జబ్బులున్న వారంతా ఆస్పత్రుల్లో చేరడం లేదా? ఇంట్లోనే ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నారా? సరైన చికిత్స అందక ప్రాణాలు కోల్పోతున్నారా? అంటే అలాంటిదేమి లేదని డేటాలు స్పష్టం చేస్తున్నాయి. స్పెయిన్‌లోని 71 కార్డియాక్‌ సెంటర్ల నుంచి సేకరించిన డేటా ప్రకారం.. గుండెజబ్బు ఉన్నోళ్లకు స్టంట్లు వేయడం, ఓపెన్‌ హార్ట్‌ సర్జరీలు చేయడం 81 శాతం వరకు తగ్గిపోయాయి. స్టంట్లు వేయడం 40 శాతం తగ్గిపోయాయి. గుండె జబ్బులు రాకుండా ముందు జాగ్రత్తతో ఆస్పత్రులకు వెళ్లే వారి సంఖ్య 48 శాతానికి తగ్గింది. గుండె సంబంధిత పరీక్షలు నిర్వహించడం 57 శాతం మేర తగ్గింది. 

అమెరికాలోని 9 ప్రధాన కార్డియాక్‌ సెంటర్ల నుంచి సేకరించిన డేటా ప్రకారం.. తీవ్రమైన గుండె జబ్బులతో ఆస్పత్రులకు వచ్చే వారి సంఖ్య 38 శాతం తగ్గింది. కోవిడ్‌ సమస్య వచ్చినప్పటి నుంచి హద్రోగ పరీక్షలు నిర్వహిస్తున్నారు. రోగులకు వైద్య చికిత్సల విషయంలో తీవ్ర జాప్యం ఉన్నట్టు హాంకాంగ్‌ డేటా చెబుతోంది. భారత్‌లో ఫిబ్రవరి నుంచి ఏప్రిల్‌ మధ్య గుండె, క్యాన్సర్, కిడ్నీ, లివర్, లంగ్స్‌ సహా 825 రకాల చికిత్సలకు సంబంధించి తీవ్రమైన కేసుల సంఖ్య 20 శాతానికి తగ్గిందని ‘నేషనల్‌ హెల్త్‌ అథారిటీ’ సేకరించిన డేటా ప్రకారం స్పష్టం అవుతోంది. ఫిబ్రవరి–ఏప్రిల్‌ నెలల మధ్య గుండె జబ్బులకు సంబంధించిన చికిత్సలు 76 శాతం తగ్గాయి. తీవ్రమైన గుండె కేసులు కూడా గణనీయంగా తగ్గినట్లు ఆస్పత్రుల డేటాల్లో తేలింది. 

కారణాలు ఇవేనా? :
కోవిడ్‌ కారణంగా అనారోగ్యానికి చెందిన స్వల్ప లక్షణాలతో ఆస్పత్రులకు వెళ్లడం లేదు. కరోనా వైరస్‌ కారణంగా గుండె రక్త నాళాల్లో పేరుకు పోయిన రక్తాన్ని తొలగించేందుకు వైద్యులు సర్జికల్‌ పద్ధతులను అనుసరించడం లేదు. బ్లడ్‌ క్లాట్స్‌ను కరగించేందుకు ట్యాబ్లెట్లను సిఫార్సు చేయడం. మందులు అందుబాటులో ఉండటం, ‘కీలేషన్‌ థెరపి’ లాంటి ప్రత్యామ్నాయాలు అందుబాటులోకి రావడం. గుండె జబ్బులను పెంచే పర్యావరణ కాలుష్యం తగ్గిపోయింది. ఇళ్ల నుంచి పని చేసే సౌకర్యం లభించడంతో వృత్తిపరమైన ఒత్తిళ్లు తగ్గిపోయాయి.

గుండె జబ్బులు ఉన్నవారిలో 50 శాతం మందికి వృత్తిపరమైన ఒత్తిళ్ల వల్లనే గుండె జబ్బులు వస్తున్నాయి. ప్రయాణాలు తగ్గిపోవడం. వేళకు నిద్రపోయే వెసలుబాటు లభిస్తుంది. ఆరోగ్యానికి హానికరమైన ధూమపానం, మద్యపానం అందుబాటులో  లేదు. లాక్‌డౌన్‌ కారణంగా వాటిల్లుతోన్న ఆర్థిక నష్టం ముందు స్వల్ప అనారోగ్య సమస్యలను పట్టించుకోవడం లేదు. కరోనా కారణంగా ఆరోగ్యం పట్ల అవగాహన పెరిగింది. రోడ్డు ప్రమాదాల విషయానికి వస్తే.. లాక్‌డౌన్‌ కారణంగా వాహనాల రాకపోకలు ప్రమాదాలు పూర్తిగా తగ్గిపోయాయనే చెప్పాలి. 

Also Read | దేశంలో 50వేలకు చేరువలో కరోనా కేసులు