గర్భిణీలు అస్పిరిన్ ట్యాబ్లెట్ వేసుకోవచ్చా? వేసుకుంటే ఏమవుతుంది?

  • Publish Date - February 20, 2020 / 05:45 AM IST

ఆస్పిరిన్.. ఈ ట్యాబ్లెట్ గురించి చాలా మందికి తెలుసే ఉంటుంది. దీనిని ఎక్కువగా వాడినప్పుడు కొన్ని కడుపుకు సంబంధించిన సమస్యలు తలెత్తుతుంటాయి. అందువల్లే డాక్టర్లు కూడా ఆస్పిరిన్ ఇచ్చే ముందు ఎన్నో జాగ్రత్తలు చెప్తుంటారు. అందుకే ఎక్కువగా ఆస్పిరిన్ వాడడం మంచిది కాదని యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ హెల్త్ సైన్స్ సెంటర్ డాక్టర్ల అభిప్రాయం. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు దీన్ని చాలా తక్కువ వాడాలని తెలిపారు.  

వారి ఆధ్యాయనం ప్రకారం.. గర్భిణీ స్త్రీలు అస్పిరిన్ 81 మిల్లీగ్రాములు మాత్రమే తీసుకోవాలని సూచిస్తున్నారు. ఎందుకంటే గర్భిణీ స్త్రీలు వేసుకొనే ప్రతి మందు ప్రభావం తల్లి మీదే కాక శిశువు మీద కూడా ఉంటుంది. గర్భం ఆరవ నెల నుండి వాటిని నివారించాలి. అంతేకాదు ప్రీక్లాంప్సియా ప్రమాదం ఉన్న గర్భిణీ స్త్రీలకు తక్కువ డోస్ ఆస్పిరిన్ ఒక ప్రామాణిక చికిత్స. రోజువారీ డోస్ లో రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉంది.. అందుకే గర్భిణీ స్త్రీలందరికీ తక్కువ డోస్ ఆస్పిరిన్ ఇవ్వడం మంచిదని డాక్టర్లు సుచిస్తున్నారు. 

ప్రీక్లాంప్సియా అంటే గర్భధారణ సమయంలో కొంతమంది మహిళల్లో అధిక రక్తపోటు వల్ల వచ్చేది. దీనికి ప్రధాన లక్షణాలు ఏమిటంటే.. బరువు పెరగడం, తలనొప్పి, వికారం, దృష్టిలో మార్పు, పొత్తకడుపు నొప్పి, మూత్ర ఉత్పత్తి తగ్గిపోవడం, రక్తంలో ప్లేటోలెట్ల తగ్గుదల స్థాయిలు, బలహీనమైన కాలేయ పనితీరు, శ్వాస ఆడకపోవుట వంటి లక్షణాలు కనబడతాయి.