Sperm Count: స్పెర్మ్ కౌంట్ లక్షల్లో పెరుగుతుంది.. మగమహారాజులకు గొప్ప వరం.. రోజు ఇలా చేయండి చాలు!

ప్రస్తుతం కాలంలో చాలా మంది పురుషుల్లో ఫెర్టిలిటీ(Sperm Count) సమస్యలు తలెత్తుతున్నాయి. మరీ ముఖ్యంగా స్పెర్మ్ కౌంట్

Sperm Count: స్పెర్మ్ కౌంట్ లక్షల్లో పెరుగుతుంది.. మగమహారాజులకు గొప్ప వరం.. రోజు ఇలా చేయండి చాలు!

Eating sprouts every day increases sperm count

Updated On : August 24, 2025 / 5:58 PM IST

Sperm Count: ప్రస్తుతం కాలంలో చాలా మంది పురుషుల్లో ఫెర్టిలిటీ సమస్యలు తలెత్తుతున్నాయి. మరీ ముఖ్యంగా స్పెర్మ్ కౌంట్ తగ్గడం ఓ సాధారణ సమస్యగా మారింది. దీనివల్ల చాలా మంది జంటలు సంతానలేమి సమస్యలతో బాధపడుతున్నారు. దీనికి కారణాలు కూడా చాలానే ఉన్నాయి. జీవనశైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాలతో ఈ సమస్య ఎక్కువవుతోంది. అయితే, కొన్ని సహజమైన మార్గాల్లో స్పెర్మ్ కౌంట్‌(Sperm Count)ను పెంచుకోవడం సాధ్యమే. అందులో మొలకలు (Sprouts) ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి, ఎలాంటి మొలకలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు అందుతాయి అనేది ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

Women Health: అబార్షన్ మనసును బాధిస్తోందా.. శారీరక శక్తి, మానసిక ప్రశాంతత కోసం ఇవి చేయండి

మొలకలు సహజ సూపర్ ఫుడ్:
మొలకలు అనేవి ధాన్యాలు, పప్పులు విత్తనాల రూపంలో నానబెట్టి మొలకలుగా తయారుచేసినవే. వీటిలో పోషక పదార్థాలతో నిండివుంటాయి. వాటిలో ముఖ్యమైనవి ప్రోటీన్, జింక్, సెలీనియం, ఫోలేట్, విటమిన్ C, B గ్రూప్ విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు. ఈ పోషకాలు పురుషుల్లో స్పెర్మ్ ఉత్పత్తిని ప్రేరేపించి, ఆరోగ్యవంతమైన స్పెర్మ్ కౌంట్‌ను పెంచడంలో సహాయపడతాయి.

స్పెర్మ్ కౌంట్ పెంచే 5 రకాల మొలకలు:

1.మినప్పప్పు మొలకలు:
వీటిలో ప్రోటీన్, ఫోలేట్, ఐరన్ అధికంగా ఉంటుంది.ఇవి శరీర కణజాలాలకు అవసరమైన నిర్మాణం ఇస్తుంది. శుక్రకణాల ఉత్పత్తికి శక్తినిస్తుంది.

2.ఉలవలు మొలకలు:
ఉలవలు మొలకలు ఆయుర్వేదంలో పురుషుల శక్తి వృద్ధికి ఉపయోగపడే ఆహారంగా పరిగణించబడుతుంది. ఇవి శక్తి, స్టామినా పెంపుకు తోడ్పడతాయి, టెస్టోస్టెరాన్ ఉత్పత్తిలో మెరుగ్గా ఉపయోగపడుతుంది.

3.అల్లనెజ్జల మొలకలు:
వీటిలో జింక్, సెలీనియం లాంటి ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఇవి స్పెర్మ్ కౌంట్‌తో పాటు, స్పెర్మ్ క్వాలిటీని కూడా మెరుగుపరచగలవు. శరీరంలో హార్మోన్ల సమతుల్యతను ఏర్పరుస్తుంది.

4.సన్‌ఫ్లవర్ సీడ్స్ మొలకలు:
వీటిలో విటమిన్ E, ఫోలేట్, హెల్తీ ఫ్యాట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి శుక్రకణాల DNA రక్షణలో కీలక పాత్ర పోషిస్తాయి. స్పెర్మ్ మోటిలిటీ (చలనం) మెరుగవుతుంది.

5.ఫెనుగ్రీక్ మొలకలు:
ఇది టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తికి సహాయపడతాయి. ఇది రక్తప్రసరణ మెరుగుపరిచి జననాంగాలకు ఆరోగ్యం కలుగజేస్తాయి.

మొలకలు ఎలా ఉపయోగించాలి:

  • ఉదయం ఖాళీ కడుపుతో తినటం మంచిది.
  • తేనె లేదా నిమ్మరసం కలిపి తినవచ్చు.
  • రోజుకు 100 నుంచి 150 గ్రా తినడం మంచిది

జాగ్రత్తలు:

  • మొలకలు తినే ముందు బాగా కడగాలి
  • బాక్టీరియా వలన ఇన్ఫెక్షన్లు రాకుండా చూసుకోవాలి.
  • గర్భిణీలు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు వండిన రూపంలో మాత్రమే తీసుకోవాలి.
  • అధికంగా తినటం వల్ల అజీర్ణం వంటి సమస్యలు రావచ్చు.