Women Health: అబార్షన్ మనసును బాధిస్తోందా.. శారీరక శక్తి, మానసిక ప్రశాంతత కోసం ఇవి చేయండి
మాతృత్వం అనేది ప్రతీ మహిళ జీవితం(Women Health)లో చాలా ప్రత్యేకం. కానీ, ఈ మధ్య కాలంలో చాలా మంది ఆ భాగ్యం లేక బాధపడుతున్నారు.

Women Health: మాతృత్వం అనేది ప్రతీ మహిళ జీవితంలో చాలా ప్రత్యేకం. కానీ, ఈ మధ్య కాలంలో చాలా మంది ఆ భాగ్యం లేక బాధపడుతున్నారు. కొంతమందికి ప్రెగ్నెంట్ అయ్యి మధ్యలో అబార్షన్ అవడం కూడా చూస్తూనే ఉంటాం. మహిళల్లో ఇది చాలా భాధను రగిలిస్తుంది. అలాగే, శారీరకంగా, మానసికంగా(Women Health) కూడా వారిపై గట్టి ప్రభావం చూపిస్తుంది. అలాంటి సమయంలో శరీరానికి, మనసుకు విశ్రాంతి, మద్దతు, ప్రేమ, సంరక్షణ ఎంతో అవసరం. కాబట్టి, అబార్షన్ తరువాత శారీరక, మానసిక శక్తిని పొందేందుకు పాటించవలసిన మార్గాలు, ఆహారం, వ్యాయామం, మానసిక దృఢత గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
Booster Breakfast: బూస్టర్ బ్రేక్ ఫాస్ట్.. ఉదయం ఇది తింటే రోజంతా ఉత్సాహంగా ఉంటారు.. అలసట అసలే రాదు
1.శారీరక శక్తిని తిరిగి పొందేందుకు:
అబార్షన్ తరువాత శరీరం రక్తనష్టం, హార్మోనల్ మార్పులు, అలసటకు గురవుతుంది. కాబట్టి, పోషకాహారాన్ని పునరుద్ధరించుకోవాలి. ఐరన్ పుష్కలంగా ఉండే పచ్చిమొక్కజొన్న, కేజూరాలు, పాలకూర, బీట్‌రూట్, మటన్ లివర్ తినాలి. అలాగే, ప్రొటీన్ల కోసం గుడ్లు, పప్పులు, నట్‌లు, మటన్, చికెన్ తినాలి. ఫైబర్ కోసం ఫలాలు, కూరగాయలు, గోధుమ రొట్టెలు తినాలి. హైడ్రేషన్ కోసం రోజుకి కనీసం 2.5 లీటర్ల వరకు నీరు త్రాగాలి. అబార్షన్ తరువాత పూర్తిగా బాడీకి విశ్రాంతి ఇవ్వాలి. కనీసం 7 నుంచి 9 గంటల నిద్ర తప్పకుండా తీసుకోవాలి. 2 వారాలు బలమైన పనులు చేయకుండా ఉండడం మంచిది.హార్మోన్ సమతుల్యత కోసం తులసి, అశ్వగంధ లాంటి ఆయుర్వేద మూలికలు వైద్యుల సలహాతో తీసుకోవాలి. గర్భస్రావం తరువాత మాసికవిధి సాధారణంగా పునరుద్ధరించుకోవడానికి కనీసం 4 నుంచి 6 వారాలు పడుతుంది.
2.మానసిక శక్తిని పునరుద్ధరించుకోవడం:
ఈ సమయంలో భావోద్వేగాలకు లోనవడం సాధారమే. కానీ, ఇలా భావించడం తప్పు అనే భావనను విడిచిపెట్టండి. ఎక్కువసేపు మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో గడపాలి. అవసరమైతే మానసిక ఆరోగ్య నిపుణుడిని కలిసి థెరపీ, కౌన్సిలింగ్ తీసుకోవడం మంచి ఫలితాలను ఇస్తుంది. అలాగే యోగాసనాలు, ప్రాణాయామం, శవాసనం చేయడం వల్ల ఉపశమనం పొందవచ్చు. రోజు కనీసం 10 నుంచి 15 నిమిషాల మెడిటేషన్ బాడీని రిలాక్స్ చేస్తుంది.
3.మళ్లీ ఆరోగ్యంగా జీవించడానికి:
మొదట నడకలతో ప్రారంభించండి. రోజు కనీసం 15 నుంచి 20 నిమిషాలు నడవడం అలవాటు చేసుకోండి. శరీరం సహకరించే దశలోకి వచ్చాక హల్కా యోగా, స్ట్రెచింగ్ చేయండి. అలా చేసినప్పుడు ఏవైనా రక్తస్రావం, తీవ్రమైన నొప్పులు, జ్వరం ఉంటే వైద్యుని వెంటనే కలవాలి. మళ్ళీ గర్భం పొందడానికి ప్రయత్నించే ముందు కనీసం 2 నెలల వరకు బ్రేక్ ఇవ్వడం మంచిది.